Mehreen : తెలుగు తెరపై పలు హిట్ చిత్రాల్లో నటించిన మెహ్రీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇటీవలి కాలంలో బాగా సన్నగా అయింది. తరువాత గ్లామర్ డోస్ పెంచింది. అయినప్పటికీ అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు. అయితే అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు యాక్టివ్గానే ఉంటోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
తాజాగా మెహ్రీన్ తన కాళ్లను చూపిస్తూ కుర్చీలో కూర్చుని ఫొటోలకు పోజులిచ్చింది. డెనిమ్ దుస్తుల్లో ఈ అందాల తార మెరిసిపోతోంది.
ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఇటీవలే మారుతి తెరకెక్కించిన మంచి రోజులొచ్చాయి అనే మూవీలో నటించింది. ఈమె నటించి ఎఫ్3 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.