Meenakshi Chaudhary : టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. గత చిత్రంతో మాత్రం మహేశ్ నిరాశనే ఎదుర్కొన్నాడు. దీంతో ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలన్న లక్ష్యంతో ‘గుంటూరు కారం’ మూవీని చేస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం చిత్రం తెరకెక్కుతుండగా, ఈ చిత్రం గుంటూరు మిర్చి యార్డు నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలోనే ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘గుంటూరు కారం’ రుచి చూపించనున్నారు నిర్మాత ఎస్ రాధాకృష్ణ.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో మహేశ్, మీనాక్షిలపె ఓ పాటను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది . ఈ వారంలోనే ఈ పాట పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. నెలాఖరుకి సినిమా మొత్తం పూర్తి కానుందట. ఇప్పటికే ఓ పాటను విడుదల చేశారు. త్వరలో రెండో పాటను విడుదల చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది.. కుటుంబ సమేతంగా చూడదగ్గ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇదని, మహేశ్ మునుపెన్నడూ చేయని మాస్ పాత్రలో కనిపించనున్నారు. ‘గుంటూరు కారం’ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్నారు. ఆ తర్వాత ఇందులో శ్రీలీలను ఎంపిక చేశారు. అయితే, ఈమె పాత్ర సెకెండ్ లీడ్ హీరోయిన్‌గానే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా పూజా హెగ్డే తప్పుకోవడంతో శ్రీలీల మెయిన్ లీడ్‌గా మారింది. . దీంతో రెండో హీరోయిన్‌గా హిట్ బ్యూటీ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.

గుంటూరు కారం చిత్రంలో మహేష్ బాబు, మీనాక్షి కాంబినేషన్ సీన్స్ హైలైట్‌గా ఉండబోతున్నాయట. వీళ్లిద్దరి మధ్య కాస్త సరసం, టీజింగ్ సన్నివేశాలు మెప్పిస్తాయని తెలిసింది. దీంతో ఈ కాంబోపై ఆసక్తి పెరిగిపోతోంది. థమన్ ఈ సినిమాకు సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు.ఈ చిత్రంతో మీనాక్షి విజయం అందుకుంటుందని అందరు భావిస్తున్నారు.