Matti Katha OTT Release Date : ఈరోజుల్లో, చిన్న సినిమాలు కూడా, భారీ వసూళ్లని రాబడుతున్నాయి. మంచి కథతో వచ్చే, చిన్న సినిమా కూడా, ఈ రోజుల్లో పెద్ద హిట్ అవుతోంది. కొన్ని కోట్లు పెట్టి, సినిమా తీసినా రానంత ఫలితం, చిన్న చిన్న సినిమాలకి వస్తున్నాయి. కంటెంట్ బాగుంటే, ఎంత చిన్న సినిమానైనా సరే, ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చిన్న సినిమాలు ప్రేక్షకులని బాగా మెప్పిస్తున్నాయని, చాలాసార్లు రుజువు అయింది. ఆడియన్స్ కి నచ్చినటువంటి సినిమాల్లో మట్టి కథ కూడా ఒకటి. ఓటీటీలోకి ఈ సినిమా రాబోతోంది. మట్టి కథ మూవీ ఓటిటి, స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ వంటి వివరాలను ఇప్పుడే తెలుసుకుందాం.
తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో, చాలా సినిమాలు ఇప్పటికే వచ్చాయి. కొన్ని అయితే, బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేసాయి. తాజాగా, అచ్చమైన పల్లెటూరు సినిమాగా బాక్స్ ఆఫీస్ వద్ద, బానే ఆడియన్స్ మనసులని గెలుచుకుంది. కలెక్షన్లు సంగతి ఎలా ఉన్నా, ప్రేక్షకుల మనసు దోచుకుంది మట్టి కథ సినిమా. మూవీ రిలీజ్ అవ్వకుండానే ఏకంగా తొమ్మిది అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పలు విభాగాల్లో తొమ్మిది అవార్డులని దక్కించుకుంది మట్టి కథ.

బెస్ట్ ఇండియన్ ఫీచర్ ఫిలిం, బెస్ట్ యాక్టర్ ఫీచర్ ఫిలిం వంటి క్యాటగిరిలో అవార్డులు వచ్చాయి. ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ ఆహా వేదికగా అక్టోబర్ 13 నుండి మట్టి కథ సినిమా స్ట్రీమింగ్ అవబోతోంది. బలగం వంటి కాన్సెప్ట్ తో, ఈ సినిమాని తెరకెక్కించారు. తెలంగాణ సంస్కృతి, మానవ బంధాల పరిమాణాన్ని, పల్లెల్లో ప్రజల జీవన విధానాన్ని ఇందులో కళ్ళకి కట్టినట్లు చూపించారు.
అలానే, వ్యవసాయమే జీవనాధారంగా తెరకెక్కించారు. పవన్ కడియాలా దర్శకత్వం వహించారు. అజేయ్ వేద్ హీరోగా నటించారు. జానపద గాయని కనకవ్వ, బలగం తాత సుధాకర్ రెడ్డి, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు. అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మాతగా, సతీష్ మంజీర సహా నిర్మాతగా వ్యవహరించారు.