Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు.ఆయన ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు. ఆయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నాడు.స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేస్తున్నారు. గుంటూరు కారం అంటూ వస్తోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానుందని ప్రకటించారు.
మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి తప్పక సమయం కేటాయిస్తాడు. ఆయనతో రెగ్యులర్‌గా వాళ్లతో విదేశాలకి వెళుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు. తన భార్య నమ్రతతో పాటు తన ఇద్దరు పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. మహేష్ ది ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం. ఆయన తన ఫ్యామిలీ కోసమే కాక సమాజం కోసం చాలా చేశాడు. తను కొన్ని గ్రామాలని దత్తత తీసుకున్నాడు. అలానే చాలా మందికి అవసరం వచ్చినప్పుడు తనవంతు సాయం చేస్తూ వస్తున్నాడు. అయితే తాజాగా మహేష్ బాబు గురించి ఒక వార్త ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
మహేష్ స్కూలింగ్ చేస్తున్నప్పుడు ఆయనకి మార్కులు చాలా తక్కువ వచ్చేవట. ఆయన కృష్ణ తనయుడు కావడంతో ఉపాధ్యాయులు కూడా మహేష్‌ను గారాబం చేసేవారు. మార్కులు తక్కువ వచ్చినా ఏమీ అనేవారు కాదట. మహేష్‌కి గారాబం ఎక్కువ కావడంతో చదువు సరిగ్గా అబ్బలేదు. అయితే పదో తరగతిలో కూడా అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదు. సినిమాల వల్ల కొడుకు చదువు ఎక్కడ పాడైపోతుందో అన్న భయంతో మహేష్‌ని మందలించాడట. అయిన కూడా పదో తరగతిలో అనుకున్న మార్కులు రాలేదు. ఇష్టమైన లయోలా కాలేజీలో ఇంటర్ చదివేందుకు మహేష్‌కు అడ్మిషన్ కూడా రాలేదట. డిగ్రీలో అయిన సీటు సంపాదించుకోవాలని ఇంటర్‌లో కష్టపడి చదవగా, మంచి మార్కులు రావడంతో తాను అనుకున్నట్టుగానే లయోలా డిగ్రీ కాలేజీలో బీకాం సీటు సాధించాడు. ఆ సమయంలో మహేష్‌కి సినిమాలపై ఆసక్తి పెరగడంతో తిరిగి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…