వినోదం

Athidhi Movie : భారీ హైప్‌తో తీసిన మ‌హేష్ బాబు అతిథి మూవీ.. ఫ్లాప్ అయినందుకు కార‌ణం అదేనా..?

Athidhi Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి మూవీ 2007 అక్టోబర్ 18న విడుదలై ఫ్యాన్స్ ని నిరాశ పరిచింది. ఇక ఆడియన్స్ కి కూడా నచ్చక పోవడంతో ఫ్లాప్ అయింది. అయితే ఇప్పుడు చూస్తే మాత్రం బాగానే ఉందిగా అనిపిస్తుంది. దీనికి అనేక కారణాలున్నాయి. సురేంద‌ర్‌ రెడ్డి డైరెక్షన్ లో స్టైలిష్ గా తీసిన అతిథి మూవీ భారీ అంచనాల నడుమ రిలీజై డిజాస్టర్ గా నిలిచింది. సూపర్ స్టార్ హోదా వచ్చాక ఒప్పుకున్న మూవీ కావడం, బాలీవుడ్ న‌టి అమృతారావు హీరోయిన్ కావడం, బాలీవుడ్ ప్రొడక్షన్స్ యూటీవీ భాగస్వామ్యం కావడం.. ఇలా వివిధ కారణాలతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది.

దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 712 థియేటర్లలో విజయదశమి శుభాకాంక్షలతో రిలీజైంది. అయితే ఈ మూవీ ఫ్యాన్స్ అంచనాలను రీచ్ కాలేదు. మొదటి భాగం సూపర్ గా ఉంటుంది. మహేష్ ఎంట్రీ, సిగరెట్ షేరింగ్ ఫైట్ అన్నీ అదిరిపోయాయి. సెకండాఫ్ లో హీరోయిన్ ని బైక్ మీద వెళ్లి సేవ్ చేయడం వంటి సీన్లు బాగుంటాయి. సత్యం ఏమిటో సాంగ్ చిత్రీకరణ అదిరింది. మహేష్ హెయిర్ స్టైల్ అప్పట్లో అలరించింది. సురేంద‌ర్ రెడ్డి టేకింగ్, మణిశర్మ సంగీతం అన్నీ సూపర్బ్‌. తొలివారం రికార్డ్ ఓపెనింగ్స్ సాధించిన ఈ మూవీ చివరకు డిజాస్టర్ అయింది. రిచ్ గా తీసిన ఈ మూవీ 3 గంటలపాటు సాగడం మైనస్ అయింది. మొదటి భాగం బాగున్నా.. సెకండాఫ్ బోర్ కొట్టేలా చేసింది.

Athidhi Movie

హీరోయిన్ ని సేవ్ చేయడం ప్రధాన ఇతివృత్తం. కానీ మధ్యలో కొన్ని అనవసరమైన‌ సన్నివేశాలు పెట్టారు. ఐటెం సాంగ్ కూడా తీసెసి 2 గంటల 20 నిమిషాలకు కుదించవచ్చు. క్లైమాక్స్ లో చిన్నపాప చనిపోవడం, హెవీ వయొలెన్స్ మనకు జీర్ణం కాని అంశం. దాంతో మూవీ చూసి బయటకు వచ్చాక ఫీల్ గుడ్ అనిపించదు. ఇక కామెడీ మిస్ అయింది. స్కోప్ ఉన్నా కామెడీ పండించే సీన్స్ లేవు. సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. హీరోయిన్ కూడా మైనస్ అయింది. పోకిరి వచ్చి ఏడాదిన్నర అయినా సరే.. అదే మూడ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. తీరా అతిథిలో అలాంటి ఎంటర్ టైన్మెంట్ మిస్సయింది. దీంతో మూవీ డిజాస్ట‌ర్ అయింది. అయితే క్లైమాక్స్‌ను ఇంకాస్త మార్చి ఉంటే బాగుండేది. అప్పుడు మ‌హేష్ ఖాతాలో ఇంకో హిట్ ప‌డి ఉండేది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM