Leo Movie Collections : సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న హీరో విజయ్. ఆయనకి తమిళంలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మాస్టర్’ తర్వాత ఆ స్థాయి హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ రీసెంట్‌గా ‘లియో’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, రెస్పాన్స్ మాత్రం భారీగానే వచ్చింది. ఫలితంగా ఈ మూవీకి వసూళ్లు ఓ రేంజ్‌లో లభించాయి. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేసింది. అలాగే, సంజయ్ దత్ విలన్‌గా, అర్జున్ సర్జా కీలక పాత్రల్లో కనిపించారు.
విజయ్‌కి తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ని టాలీవుడ్ టాప్ నిర్మాత నాగ వంశీ 17 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు.అయితే ఓపెనింగ్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ మార్కు ని దాటిన ఈ సినిమా ఫుల్ రన్ లో దాదాపుగా పాతిక కోట్ల రూపాయల షేర్‌ని రాబట్టింది. ఈ చిత్రానికి మూడు లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రావడం గొప్ప విషయం. డివైడ్ టాక్ వచ్చిన కూడా ఈ సినిమాకి ఆ రేంజ్‌లో వసూళ్లు రావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఇదిలా ఉంటే తమిళనాడు లో కూడా ఈ చిత్రం ప్రతిష్టాత్మక 200 కోట్ల రూపాయిల మార్కును అందుకొని సంచలనం సృష్టించింది.

మొత్తంగా చూస్తే.. లియో చిత్ర 575 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.ఇది వాస్తవానికి వచ్చిన డివైడ్ టాక్ కి అద్భుతమైన రెస్పాన్స్ అనే చెప్పాలి. రజనీకాంత్ నటించిన ‘జైలర్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 626 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, విజయ్ లియో చిత్రానికి కేవలం 575 కోట్లు మాత్రమే వచ్చాయి.అంటే జైలర్ చిత్రం కంటే 50 కోట్ల రూపాయిల గ్రాస్ తక్కువ ఉందని విశ్లేషకులు అంటున్నారు. దాదాపు క్లోజింగ్ కలెక్షన్స్ కూడా దగ్గర పడుతుండడంతో లియో సినిమా జైలర్‌ని దాటడం కష్టమని అంటున్నారు.