Kirak RP : జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్న ఆర్పీ ఇప్పుడు బిజినెస్‌లోకి దిగాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అవుతున్నారు.హైదరాబాద్ లో ఇప్పటికే మూడు బ్రాంచ్ లను ఓపెన్ చేసిన ఆర్పీ అనంతపురానికి సంబంధించి ఫ్రాంఛైజీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తిరుపతిలో కూడా స్టార్ట్ చేశారు. తిరుపతిలో అవుట్ లెట్‌ను మంత్రి ఆర్కే రోజా చేత ప్రారంభించిన కిరాక్ ఆర్పీ త్వరలోనే తిరుపతి, చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో ఫ్రాంచేజీ లను ఇస్తున్నామన్నారు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించేలా చేపల వంటకాలను అందుబాటులో తెచ్చామన్నారు. కీరాక్ ఆర్పీ రెస్టారెంట్ ఓపెనింగ్ లో సినీ నటి మెహరీన్ కూడా సందడి చేసింది.
ఆర్పీకి ఉండే క్రేజ్ వల్ల రేట్స్ బాగా పెంచుతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇలా అయితే కొన్ని నెలల పాటు బిజినెస్ బాగా జరిగినా దీర్ఘకాలంలో ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంది.ఆర్పీ రేట్లు తగ్గిస్తే బిజినెస్ బ్రహ్మాండంగా జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు . నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు విశేష ప్రజాదరణ అందుకుందన్నారు. ఆర్పీ రెస్టారెంట్‌లో కొరమేను, గండి, రవ్వ, సన్న చేపలు, తలకాయ చేపల పులుసు, బొమ్మిడాయల పులుసుతో పాటు.. రాగి సంగటి రుచికరంగా అందిస్తున్నట్లు అవుట్ లెట్ నిర్వహకులు తెలిపారు. కిరాక్ ఆర్పీ కి చెందిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ ను తిరుపతి మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డిలతో కలిసి మంత్రి రోజా ప్రారంభించారు.
తిరుపతిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ ప్రారంభించిన కిరాక్ ఆర్పీని మంత్రి రోజా అభినందించారు. కార్తీక మాసం కాబట్టి ఇప్పుడు చేపల పులుసు తినడం లేదని, ఆ తరువాత వచ్చి రుచి చూస్తానన్నారు ఆర్కే రోజా తెలిపారు. ప్రస్తుతం బిజినెస్‌తో ఫుల్ బిజీగా ఉన్న ఆర్పీ జబర్దస్త్ షోలోకి మాత్రం రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. ఆ మధ్య జబర్ధస్త్‌పై దారుణమైన కామెంట్స్ చేశారు ఆర్పీ. ఇది పెద్ద రచ్చగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…