వినోదం

Keedaa Cola OTT Release Date : ఓటీటీలోకి రానున్న కీడా కోలా.. ఎప్పుడు, ఎందులో అంటే..!

Keedaa Cola OTT Release Date : టాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ లేటెస్ట్‌ సినిమా ‘కీడా కోలా’ చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద విజ‌యాన్ని సాధించింది. నవంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా మెప్పించింది. విమర్శకుల నుంచి మంచి రివ్యూలను సంపాదించింది. ప్రస్తుతం థియేటర్లలో మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా ఆరు కోట్ల కలెక్షన్లను రాబట్టింది.క్రైం, కామెడీ జోనర్లో వచ్చిన ఈ సినిమాలో కామెడీ టైమింగ్ బాగానే వర్కౌట్ అయినా ఎందుకనో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా స్థాయిలో జనాలకు కనెక్ట్ కాలేకపోయింది.

తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ.20 కోట్లకు వరకు కలెక్ట్ చేసి పర్వాలేదనిపించింది. అయితే సినిమా విడుదలై 4 వారాలు కావస్తుండడంతో చిత్రాన్ని డిసెంబర్ రెండో వారంలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు తీసుకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ బాగా వైరల్ అయింది. తాజా స‌మాచారం మేర‌కు ఈ క్రైమ్ కామెడీ మూవీ ఆహా ఓటీటీలో డిసెంబ‌ర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలుస్తుంది. కీడా కోలా సినిమాలో త‌రుణ్ భాస్క‌ర్‌తో పాటు చైత‌న్య‌రావు, రాగ్‌ మ‌యూర్‌, బ్ర‌హ్మానందం కీల‌క పాత్ర‌లు పోషించారు. డబ్బు అవసరం చాలా ఉన్న తాతా మనువడు ఓ షాప్ లో కీడా కోలా అనే కూల్ డ్రింక్ కొనగా అందులో బొద్దింక వస్తుంది. దాన్ని క్యాష్ చేసుకోవాలనే క్రమంలో వారికి ఎదురైన అనుభవాలు, ఓ గ్యాంగ్ స్టర్ తరుణ్ భాస్కర్ ఎంట్రీతో వారి ఫ్లాన్ మారి కథ ఎలా మలుపులు తిరిగింది అనే తదితర సన్నివేశాలతో సినిమా రూపొందింది.

Keedaa Cola OTT Release Date

2018లో వచ్చిన ‘ ఈ నగరానికి ఏమైంది?’ సినిమా తర్వాత తరుణ్‌ భాస్కర్‌ తీసిన సినిమా ‘కీడా కోలా’నే. దాదాపు ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత ఆయన ఈ చిత్రాన్ని తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తాను తీసే చివరి కామెడీ సినిమా కీడా కోలానేనని దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ సంచలన ప్రకటన చేశారు. ఈ సినిమా తర్వాత కామెడీ సినిమాలు కాకుండా వేరే జోనర్‌ సినిమాలు చేస్తానని త‌రుణ్ భాస్క‌ర్ ఓ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. డిసెంబ‌ర్‌లో ఓటీటీలోకి రానున్న ఈ సినిమాని చూసి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM