Karthika : అలనాటి అందాల తార రాధ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.80లలో టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన రాధ మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎక్కువ చిత్రాలలో నటించి అలరించింది. చిరు, రాధ కలిసి స్టెప్పులేస్తే ఫ్యాన్స్ ఫుల్ థ్రిల్ అయ్యేవారు. అయితే రాధ వారసురాలిగా కార్తీక ఇండస్ట్రీలోకి వచ్చింది. హీరోయిన్‌గా ఓ వెలుగు వెలగాలని ఇండస్ట్రీలోకి వచ్చిన కార్తీకకు మొదట్లో మంచి సినిమాలే పడ్డాయి. ‘రంగం’ రూపంలో ఆమెకు మంచి బ్రేక్ కూడా లభించిన తర్వాత ఎందుకో సక్సెస్ కాలేకపోయింది.. నాగ చైతన్యతో జోష్ అనే చిత్రంలో కూడా నటించింది.ఇక టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ‘దమ్ము’ సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ రావడంతో.. ఇక తిరుగులేదని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ అనే చిత్రంలో మాత్రమే కార్తీక కనిపించింది. ఆ సినిమా తర్వాత ఆమె దాదాపు వెండితెరకు దూరమైంది.
అవకాశాలు రాలేదో.. మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ.. సినిమాకి దూరంగా ఉన్న కార్తీక బిజినెస్ చేసుకుంటూ సత్తా చాటుతుంది. ఇటీవల రాధ పెళ్లి గురించి తెగ వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కార్తీక నిశ్చితార్థం జరగగా, ఆమె నిశ్చితార్థం ఫొటోలని షేర్ చేసింది. దీంతో ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటుందో అని కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో కార్తీక నాయరే తన సోషల్ మీడియా వేదికగా కాబోయే భర్తని పరిచయం చేసింది. ఇద్దరు కౌగిలించుకుని ఉన్న పిక్‌ని షేర్ చేసిన కార్తీక అందులో తన ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపించి.. తనకు నిశ్చితార్థం అయినట్లుగా వెల్లడించింది.
ఎంగేజ్‌మెంట్ పిక్స్ షేర్ చేసిన కార్తీక.. “నిన్ను కలవడం అనేది విధి.. నిన్ను ఇష్టపడడం మ్యాజిక్.. మన జీవన ప్రయాణం మొదలుపెట్టడానికి కౌంట్డౌన్ ప్రారంభించా.. ” అంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అతనిపై తనకి ఉన్న ప్రేమని తెలియజేసింది. కార్తీక కామెంట్స్‌ని చూస్తే వీరిద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ జంటని చూసి ప్రతి ఒక్కరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా, రోహిత్ మేనన్ దుబాయ్ కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఈ జంటని చూసి ప్రతి ఒక్కరు చూడముచ్చటైన జంట అని కామెంట్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…