Amigos : బింబిసార చిత్రం తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం అమిగోస్. ఇంట్రెస్టింగ్ టైటిల్ అండ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలై పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. కళ్యాణ్ రామ్ మూడు పాత్రలలో నటించడం ఒక పాత్రకు మరో పాత్రకు ఏ మాత్రం సంబంధం లేదని ముందు నుంచే ప్రచారం చేస్తూ ఉండడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ఏర్పడింది. నూతన దర్శకుడు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది.
సుమారు 11 కోట్ల మేర ఈ సినిమా హక్కులను రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లకు అమ్మారు. కన్నడ హీరోయిన్ ఆషిక రంగనాథ్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా, ఇందులో కళ్యాణ్ రామ్ బిపిన్ రాయ్ అలియాస్ మైఖేల్, సిద్ధార్థ, మంజునాథ హెగ్డే అనే మూడు భిన్నమైన పాత్రలలో నటించారు. మూడు పాత్రలలో తన నటనతో ఎంతగానో మెప్పించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విషయానికి వస్తే.. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా విడుదలైన ఎనిమిది వారాలకు స్ట్రీమింగ్ రానుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. అమిగోస్ చిత్రంలో ఫస్ట్ హాఫ్ తో పోల్చి చూస్తే సెకండ్ హాఫ్ బాగుండడం గమనార్హం. సరికొత్త కాన్సెప్ట్ తో దర్శకుడు రాజేంద్రరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. బాలకృష్ణ నటించిన ధర్మక్షేత్రంలోని ఎన్నో రాత్రులు వస్తాయిగాని పాటను ఆమిగోస్ లో రీమిక్స్ చేయగా, ఈ పాటకి వేటూరి సుందర రామమూర్తి లిరిక్స్ అందించిన విషయం తెలిసిందే. ఈ పాటకి థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…