Kajol : సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరగినప్పటి నుండి సెలబ్రిటీలకి కంటిపై కునుకు లేకుండా పోతుంది. వారికి సంబంధించిన ఫొటోలని, వీడియోలని తెగ రచ్చచేస్తున్నారు. ఈ మధ్య సెలబ్రిటీల హాట్ వీడియోలని నెట్టింట వైరల్ చేస్తూ టెన్షన్ పెడుతున్నారు. కొద్ది రోజుల క్రితం రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో ఇటీవల నేషనల్ వైడ్ పెద్ద చర్చకు దారి తీసింది. ఇలాంటి ఆగడాలను ఆదుకోలేకపోతే ఆడవాళ్లు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్‌గా తీసుకొని సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడిచింది.
అయితే ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్‍కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాజోల్ డ్రెస్ మార్చుకుంటున్నట్టుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, అందరు ఇది చూసి షాక్ అవుతున్నారు. ఆమె కెమెరా ముందు డ్రెస్ ఛేంజ్ చేసుకున్నట్టుగా అందులో ఉంది. అయితే, అది ఫేక్ వీడియో అని , డీప్‍ఫేక్ టెక్నాలజీ ద్వారా ఒరిజినల్ వీడియోలోని మహిళ శరీరానికి కాజోల్ ముఖాన్ని మార్ఫింగ్ చేసినట్టు తేలింది. మొత్తంగా కాజోల్ డ్రెస్ మార్చుకుంటున్నట్టుగా వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అని స్పష్టమైంది.

కాజోల్ వీడియోపై వెంటనే చర్యలు తీసుకోవడంతో ఆ వీడియో ఎక్కువ వ్యాప్తి చెందకుండా చేయగలిగారు. ఒరిజినల్ వీడియోలో ఉన్నది ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అని సమాచారం. ఇలాంటి వాటికీ పాల్పడుతున్న వారి పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే గాని వీటికి ముగింపు పడదని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.మరి ఇలాంటి వాటికి ఎవరు ఎప్పుడు పులిస్టాప్ పెడతారా అనేది చూడాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‍కు చెందిన ఓ డీప్‍ఫేక్ ఫొటో వైరల్ అయింది. టైగర్ 3 సినిమాలో టవల్ ఫైట్‍కు సంబంధించిన మార్ఫింగ్ ఫొటోలు చక్కర్లు కొట్టాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్.. క్రికెటర్ గిల్ భుజంపై చేయి వేసినట్టుగా ఉన్న ఓ డీప్ ఫేక్ ఫొటో వైరల్ అయింది. ఇలా కొన్నాళ్లుగా సెలబ్రిటీలకి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి.