వినోదం

Jyothi Rai : బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌న‌న్న బోల్డ్ బ్యూటీ.. త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే..!

Jyothi Rai : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ బాస్ తెలుగులో ఏడు సీజ‌న్స్ పూర్తి చేసుకొని ప్ర‌స్తుతం ఎనిమిదో సీజన్ జ‌రుపుకుంటుంది. అయితే ఈ సారి ఎక్కువ‌గా యూత్‌కు, సీరియల్ యాక్లర్లకు పెద్ద పీట వేశారు. భారీగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు షోలోకి వచ్చారు. అయితే రెగ్యులర్ టెలివిజన్ ప్రేక్షకులకు ఈ కంటెస్టెంట్లను గుర్తుపట్టడమే కష్టంగా మారింది. అయితే ఇలాంటి విమర్శల నేపథ్యంలో వైల్డ్ కార్డు ఎంట్రీలను సిద్దం చేస్తున్నది. అయితే సోషల్ మీడియానే కాకుండా తెలుగు, కన్నడ ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న హాట్ బ్యూటీని బిగ్ బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకురానున్నారనే టాక్ న‌డుస్తుంది.

బిగ్ బాస్ కు సంబంధించి ఇప్పటిదాకా ప్రసారమైన ప్రతి సీజన్లోనూ వైల్డ్ కార్డు ఎంట్రీ అనేది హాట్ టాపిక్కే. కానీ ఆ వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌజ్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ సడన్ గా ఎలా వస్తారో అంతే ఫాస్ట్ గా బయటకు వెళ్లిపోతారు కూడా. ఈ సీజన్లో కూడా ఓ బో*ల్డ్ బ్యూటీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆమె మరెవరో కాదు బుల్లితెర హాట్ బాంబ్ జ్యోతి రాయ్. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న జ్యోతి, ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సీరియల్ లో ఎంతో పద్ధతిగా కనిపించే ఆమె సినిమాల కోసం ఊహించని రేంజ్ లో హాట్ షో చేసి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది. అలాగే ఓ యంగ్ డైరెక్టర్ ను రెండవ పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది.

Jyothi Rai

ఈ నేపథ్యంలో ముందుగానే ఆమెను బిగ్ బాస్ హౌజ్ లోకి కంటెస్టెంట్ గా తీసుకునే ప్రయత్నం జరిగింది. కానీ ఆమె షూటింగ్ లతో బిజీగా ఉండడం వల్ల ఆ టైంలో వెళ్లలేదని జ్యోతి స్వయంగా వెల్లడించింది. అందుకే ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఆమెను హౌజ్ లోకి పంపుతున్నారని ప్రచారం జోరందుకుంది. కానీ ఇందులో నిజమెంత ఉంది అనేది తెలియాల్సి ఉంది.సోషల్ మీడియాలో జ్యోతిరాయ్ పెట్టే వీడియోలు, రీల్స్, స్టేటస్, ఫోటోలు ఆలోచింప జేసేలా, ఆకట్టుకొనేలా ఉంటాయి. తన అందచందాలను, ఘాటైన గ్లామర్‌ను తన ఫ్యాన్స్‌కు అందజేస్తూ ఇన్స్‌టాగ్రామ్‌లో క్రేజీగా మారుతున్నారు. అయితే ఇప్పుడు బుల్లితెరకు దూరంగా ఉంటూ వరుస సినిమాలతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ మధ్యకాలంలోనే దర్శకుడు సుక్కును వివాహం చేసుకొన్న జ్యోతిరాయ్.. తన భర్త రూపొందించే పాన్ ఇండియా మూవీలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే మరో సినిమాలో హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్‌ను పోషిస్తున్నారు. అలాగే నాలుగైదు సినిమాలు చర్చల దశలో ఉన్నాయనే విషయం సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM