Jabardasth Vinod : జబర్దస్త్ షో ద్వారా మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నవారిలో జబర్ధస్త్ వినోద్ ఒకరు.. కడప ప్రాంతానికి చెందిన వినోద్ సినిమాల్లో నటించాలనే అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి అనుకోకుండా జబర్ధస్త్ టీం చెంత చేరాడు. లేడి ఆర్టిస్ట్ గా లేడీ గెటప్స్ వేసుకొని ఆయన చేసే కామెడీ ప్రతి ఒక్కరికి నచ్చడంతో చాలా రోజుల పాటు అలా కంటిన్యూ అయ్యాడు. చమ్మక్ చంద్రతో కలిసి అనేక స్కిట్లలో వినోద్ కనిపించాడు. అయితే కొన్నాళ్ల నుంచి ఆయన పూర్తిగా జబర్దస్త్ కి దూరంగా ఉన్న అతను ఎక్కడ కూడా పెద్దగా కనిపించలేదు. అయితే ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వినోద్ పూర్తిగా బక్క చిక్కి కనపడటంతో అసలు వినోద్ కి ఏమైంది? అంటూ అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు.
తర్వాత ఆయనే తన ఆరోగ్యం గురించి రివీల్ చేశారు. హెల్త్ సమస్యలు వచ్చి వీక్ అయ్యానని వినోద్ చెప్పుకొచ్చారు. ఊపిరితిత్తులో వాటర్ ఫామ్ అవ్వడంతో ఇబ్బంది పడట్టు చెప్పిన వినోద్…ఈ సమస్య వచ్చిన సమయంలో నడవడం కూడా కష్టమైందని , తనకు ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చిందని వినోద్ తెలిపారు.ఎక్స్ రే ద్వారా ఈ సమస్యను గుర్తించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. తన ఆరోగ్యం బాగాలేనప్పుడు జబర్దస్త్‌లోని సహ నటులైన చమ్మక్ చంద్ర, అభి, రాకేశ్, గెటప్ శ్రీను, సుధీర్, రామ్‌ప్రసాద్ వంటివారందరూ కూడా తనకు అండగా ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. తను ఎవరిని సాయం అడగలేదని, వారే తన పరిస్థితిని తెలుసుకొని సాయం చేసినట్టు స్పష్టం చేశాడు.
ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడిందని , త్వరలోనే ఈవెంట్స్ చేయడంతోపాటు జబర్దస్త్ షోకి తిరిగి వస్తానని పేర్కొన్నాడు వినోద్. అయితే తన ఆరోగ్యం బాగాలేకపోవడానికి చేతబడి కారణమని చాలామంది అనుమానం వ్యక్తం చేయడంతో ఇందుకోసం ఎంతో ఖర్చు చేశాను. ఆసుపత్రి ఖర్చులు అన్నీ కలిపి దాదాపుగా రెండున్నర లక్షలు అయ్యిందని వినోద్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవని, నెలాఖరు వచ్చేసరికి తన ఖర్చులతో పాటు తన కుటుంబానికి సంబంధించిన ఖర్చులు కూడా తాను భరించగలిగే పరిస్థితిలో ఉన్నానని వినోద్ అన్నాడు. తన ఆరోగ్య సమస్యల వల్ల ఆసుపత్రిలో జాయిన్ అయినప్పుడు ఈ విషయం బయటపడిందని వినోద్ తెలియజేశాడు. ఒకరి విషయంలో తాను హామీగా నిలిచినందుకు రూ.5 లక్షలు కోల్పోయానని వినోద్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం వినోద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…