Jabardasth : జబర్దస్త్ షోలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఆ షోలో ఇప్పటి వరకు టాప్ టీమ్‌గా కొనసాగుతూ వచ్చిన సుడిగాలి సుధీర్ టీమ్ ముగ్గురు మిత్రులు షోకు గుడ్ బై చెప్పారు. నిన్న మొన్నటి వరకు వీరు జబర్దస్త్ షోను వీడుతారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను నిజం చేశారు. జబర్దస్త్ వేదికపైనే ఈ విషయాన్ని వెల్లడించారు.
గత కొంత కాలంగా జబర్దస్త్ షో అనేక వివాదాలకు మారుపేరుగా నిలిచింది. తాజాగా మహిళా కంటెస్టెంట్లను టీమ్ లీడర్స్ వేధిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయాలపై ఎవరూ సమాధానం ఇవ్వలేదు. ఇక తాజాగా సుధీర్ టీమ్ బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా విడుదల చేసిన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలో సుడిగాలి సుధీర్ టీమ్ ఎప్పటిలాగే స్కిట్ చేశారు. అనంతరం సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్ ముగ్గురూ స్టేజిపైకి వచ్చి తాము జబర్దస్త్‌ను వీడుతున్నట్లు తెలిపారు. తరువాత కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో షోలో జడ్జి రోజాతో సహా అందరూ షాకయ్యారు. ఈ ఎపిసోడ్ ఈ నెల 10వ తేదీన శుక్రవారం ప్రసారం కానుంది.
అయితే ఇది వచ్చే ఎపిసోడ్‌కు చెందిన ప్రోమో కనుక నమ్మడానికి లేదు. ఇటీవల జబర్దస్త్ షోకు రేటింగ్స్ తక్కువ కావడంతో రేటింగ్స్ పెంచుకునేందుకు ఇలాంటి ప్రయోగాలను మొదలు పెట్టారు. ఈ మధ్య కాలంలో వారు చేసిన ఇలాంటి ప్రయోగాలతో అభాసు పాలయ్యారు కూడా. అయితే తాజాగా వచ్చిన ప్రోమోను చూస్తే వారు నిజంగానే జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారా.. లేక.. రేటింగ్స్ కోసం అలా చేశారా ? అన్నది సందేహంగా మారింది. ఈ క్రమంలో వచ్చే ఎపిసోడ్‌ను చూస్తే అసలు విషయం తేలనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…