Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోగా మహేష్ బాబు దూసుకు వెళ్లిపోతున్నాడు. స్టార్ హీరో అయినా కూడా మహేష్ బాబు ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించి మెప్పించాడు. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న సినిమాలను ఎంచుకోవడానికి కూడా మహేష్ బాబు వెనుకడుగు వేయడు. మహేష్ బాబు నటించిన ప్రయోగాత్మక సినిమాల్లో నాని సినిమా ఒకటి. నాని సినిమాని ఇప్పుడు కూడా చాలామంది టీవీలో వస్తే మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. నాని సినిమాకి ఎస్ జె సూర్య దర్శకత్వం వహించారు.
మహేష్ బాబు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటించడం జరిగింది. ఈ సినిమాలో మహేష్ బాబు వయసు పెరిగినా ఎనిమిదేళ్ల కుర్రాడులా ప్రవర్తించే పాత్రలో కనపడతాడు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మహేష్ బాబు నటనకి విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి. కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. పెద్దగా హిట్ అవ్వలేదు అయితే మహేష్ బాబు స్నేహితుడు పాత్రలో నటించిన ఈ కుర్రాడు మీకు గుర్తున్నాడా..?

పై ఫోటోలో మహేష్ బాబుతో ఉన్న కుర్రాడు ఇప్పుడు ఒక క్రేజీ హీరో. అతను ఎవరో కాదు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా. అశోక గల్లా గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. హీరో సినిమాతో, అశోక్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకి ఇప్పుడు రాబోతున్నాడు. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాల లో నటించబోతున్నాడు.
ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగా అవుతోంది. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే సినిమా కోసం బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు.