Guppedantha Manasu October 28th Episode : అనుపమ దగ్గర నుండి వచ్చిన మహీంద్ర రూమ్ లో కూర్చుని, ఆలోచిస్తూ ఉంటాడు. అనుపమ నా జీవితంలోకి ఎందుకు వచ్చింది..?, మంచిగా చెడుగా ఎలా తీసుకోవాలి అని ఆలోచనలో పడతాడు. ఇంతలో వసుధార వస్తుంది. మజ్జిగ ఇస్తుంది. మీరు భోజనం చేయలేదని అడుగుతుంది. నా ఫ్రెండ్ కలిసింది. రెస్టారెంట్ కి వెళదామని అడిగితే వెళ్లానని, మహేంద్ర సమాధానం చెప్తాడు. ఇన్నాళ్లు కాంటాక్ట్ లో లేరు. అడగగానే భోజనానికి వెళ్ళారా, పేరేంటి అని వసుధార మహేంద్రని అడుగుతుంది. చాలా ఆత్మీయురాలు. చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు వివరాలను చెప్తానని, ఇంతలో వసుధారకి ఫోన్ వస్తుంది.
శైలేంద్ర ఫోన్ చేస్తాడు. ఎలా ఉన్నావ్ అని అడుగుతాడు. ఇప్పటిదాకా బాగానే ఉన్నాం. ఇకపై ఆలోచించాలి అని సమాధానం చెప్తుంది. ఆ మాత్రం భయం ఉండాలని, శైలేంద్ర అంటాడు. భయానికి, వ్యంగ్యానికి తేడా తెలియకుండా బతుకుతున్నారని వసుధార అంటుంది. ఇప్పుడు తెలుసుకుంటానులే. ఇంతకీ అరకు ఎలా ఉంది..? కాటేజ్ లు ఎలా ఉన్నాయి అని వసుధారతో శైలేంద్ర అంటాడు. మీరు ధరణి మేడమ్లా మెసేజ్ చేసి తెలుసుకున్నారు కదా అని అంటుంది. ఎవరు చెప్పారు అని శైలేంద్ర అంటాడు.
అంతా బాగానే చాట్ చేశారు కానీ, మా ఆయనతో జాగ్రత్త అని మీరు మెసేజ్ చేశారు ధరణి మేడమ్ ఎప్పుడు భర్త గురించి అలా మాట్లాడరు. అయినా మేము ఎక్కడున్నామో ధరణి మేడమ్ కి తెలుసు. కానీ, మీరు మెసేజ్ లో ఎక్కడున్నారని అడిగి దొరికిపోయారు అని వసుధార అంటుంది. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉంటే మంచిదని వసుధార అంటుంది. సార్ కి మీ నిజస్వరూపం తెలిసిన రోజు, మీ పాపం పండుతుంది అని చెప్తుంది. నాకు దక్కనిది ఎవరికి దక్కనివ్వను మొత్తం బూడిద చేస్తానని శైలేంద్ర అంటాడు.
బూడిద చేసిన మసి చేసిన మళ్లీ ఎదగలే సామర్థ్యం మాకుంది. చెట్టు కొమ్మకి డీబీఎస్ఈ బోర్డు పెట్టి పాఠాలు మళ్లీ చెప్తాం. మీకు మాత్రం ఎండి సీటు దక్కదు అని అంటుంది. ఆ అసలు వదిలేసుకుని, ఏదైనా ఉద్యోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రిషి సార్ తో చెప్పే, మంచి ఉద్యోగాన్ని ఇప్పిస్తాను అని అంటుంది. ఇగో ని టచ్ చేస్తున్నావని కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర. కోపంలో ఉంటాడు. ధరణి కాఫీ తీసుకువచ్చి ఇస్తుంది. వసుధార వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు అంట కదా. నీకు తెలిసిన చెప్పలేదు. నేను మెసేజ్ చేస్తున్నానని తెలిసి కూడా, తెలియనట్లే నటించింది అని ఫైర్ అవుతాడు.
కాఫీ చల్లగా అయిపోతుందని, చేతిలో పెట్టేసి ధరణి వెళ్ళిపోతుంది. జరిగిన యాక్సిడెంట్ గురించి, అనుపమ గురించి రిషి ఆలోచిస్తాడు. ఇక్కడ నాకు శత్రువులు ఎవరుంటారు, నేను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. ఈ ఎటాక్ ఎవరు చేసి ఉంటారు అని అన్ని గుర్తు చేసుకుంటాడు. నన్ను చంపాల్సిన అవసరం ఏవరికి ఉంది, వాడు ఎవడో కానీ ముసుగు వేసుకుని నన్ను వెంటాడుతున్నాడు. చిన్న ఆధారం దొరికిన వదిలిపెట్టను అతి తొందరలోనే వాడి ఆటలకి ముగింపు చెప్పాలని అనుకుంటాడు రిషి. ఇంకోవైపు ఇంట్లో కూర్చుని, శైలేంద్ర డిస్కషన్ మొదలుపెడతాడు.
ఇన్నాళ్లు అంటే సెలవులు. ఇప్పుడు కాలేజీ మొదలైంది కదా. వాళ్ళని రమ్మని చెప్పండి డాడ్ అని అంటాడు. లేదు నేను ఫోన్ చేయను. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పనిపై వెళ్లారు. వాళ్లంతాటి వాళ్ళు వచ్చేదాకా నేను పిలవనని ఫనీంద్ర అంటాడు. కాలేజీ పరిస్థితి ఏంటని శైలేంద్ర అంటాడు. మనం ఉన్నాం కదా. వాళ్ళు వచ్చేదాకా, కాలేజీలో అన్నిటినీ మ్యానేజ్ చేసుకుందాం. చిన్న చిన్న వాటికే డిస్టర్బ్ చేయకూడదు.
కనీసం ఎప్పుడు వస్తారో అడగండి అని శైలంద్ర అంటాడు. నీకు చెబుతుంటే అర్థం కాదా వాళ్ళు వెళ్ళింది సరదా కోసం కాదు. నా తమ్ముని బాగు చేయడం కోసం. ఇంకొకసారి అడిగితే సీరియస్ గా ఉంటుందని ఫణీంద్ర అంటాడు. మీరు, ఈ మధ్య అసలు అర్థం కావట్లేదు ఎప్పుడు చూసినా మీరు తమ్ముడు తమ్ముడు అంటున్నారు అని దేవయాని అంటుంది. నువ్వు ఎప్పుడూ అంతే. మహేంద్ర పొజిషన్ పై రిషి నాకు ప్రతిరోజు అప్డేట్ ఇస్తూనే ఉన్నాడని ఫణీంద్ర అంటాడు. ఇంతలో రిషి కాల్ చేస్తాడు.
ఫోన్ పట్టుకుని అక్కడ నుండి లేచి వెళ్ళిపోతాడు. రిషి మనల్ని పలకరించడం లేదంటే మనల్ని దూరం పెట్టాడని డౌట్ వస్తుంది దేవయానికి. వసుధార వల్లే ఇదంతా జరుగుతుందంటాడు శైలేంద్ర. వాళ్ళు ఎప్పటికైనా తిరిగి వస్తారు కదా. అప్పుడు వాళ్ళ సంగతి చూద్దాం అంటాడు. కాలేజ్ ని మన గుప్పెట్లోకి తీసుకుంటే, రిషి విలవిలాడుతూ వస్తాడని అంటాడు. రిషి రావాలంటే ఏదో ఒకటి చేయాలంటాడు. ఇప్పుడు ఎలాంటి పని చేసినా ఈజీగా దొరికిపోతామని దేవయాని అంటుంది.
రిషి, వసుధార కోసం స్పెషల్ వెహికిల్ అరేంజ్ చేసి, మహేంద్ర అరకు మొత్తం చుట్టేసి రమ్మని అంటాడు. ఇదే మినీ హనీమూన్ అనుకుని, సంతోషంగా వెళ్లి రండి అని పంపిస్తాడు. ఇంకోవైపు మహేంద్ర రిసార్ట్ లో ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తాడు. జగతి చూస్తున్నావా మన కొడుకు, కోడలు కోసం ఇదంతా చేస్తున్నాను. ఇది నీ చేతుల మీదుగా జరగాలి. కానీ నువ్వు మాత్రం మాకు అందనంత దూరానికి వెళ్లిపోయావని బాధపడతాడు. నువ్వు కోరుకున్నట్లు రిషి వసుధార సంతోషంగా ఉండేలా చూసుకుంటానని అంటాడు. నాది చిన్న కోరిక. నువ్వు రిషి వసుధార బిడ్డగా పుట్టాలి. ఈ కోర్కె తీర్చు జగతి అని అంటాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…