Guppedantha Manasu October 16th Episode : తాగి ఇంటికి వచ్చిన మహేందని, అవమానిస్తూ ఉంటుంది దేవయాని. కానీ, రిషి దానిని తట్టుకోలేక పోతాడు. ఇంటి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూస్తే… రిషి తో పాటుగా కుటుంబ సభ్యులందరూ, డిన్నర్ చేయడానికి రెడీ అవుతారు. కానీ, మహేంద్ర మాత్రం కనపడడు. తమ్ముడు భోజనం చేయడానికి, ఎందుకు రాలేదని కంగారు పడిపోతాడు ఫణింద్ర. అతనిని వెతకడం కోసం బయలుదేరుతాడు. తండ్రి ఎక్కడున్నాడో తెలుసు అని, అక్కడికి వెళ్లి తీసుకు వస్తానని రిషి చెప్తాడు. అప్పుడే, బాగా తాగి ఇంటికి వస్తాడు. కింద పడిపోతున్న తనని, రిషి సేవ్ చేస్తాడు.
కష్టాల్లో నువ్వు నాకు తోడు ఉంటావని తెలుసు అని రిషితో, మహేంద్ర అంటాడు. ఇంటికి రావడం ఇష్టం లేదని, బయట చెట్టు కింద నిద్రపోదామని అనుకున్నాను అని, మళ్లీ నువ్వు బాధ పడతావని వచ్చానని చెప్తాడు. తను తాగిన విషయం, జగతికి చెప్పొద్దని రిషితో చెప్తాడు మహేంద్ర. ఏంటి మహేంద్ర నువ్వు ఏమైపోతున్నావో నీకైనా అర్థమవుతుందా..? వయసు వచ్చిన కొడుకు ఉన్నాడు. కొత్తగా పెళ్లయిన కోడలు ఉంది. వాళ్ళ సంతోషం గురించి ఆలోచించవా..? నువ్వు చేస్తున్నది ఏంటి అని మహేంద్ర పై సీరియస్ అవుతుంది దేవయాని.
ఇదే సంతోషమని దేవయానిపై సెటైర్ వేస్తాడు మహేంద్ర. జగతి టైం అయిపోయింది వెళ్ళిపోయింది. నాలుగు రోజులు ఏడ్చిన తర్వాత, మళ్ళీ మనం మన పని చేసుకోవాలి. కానీ, ఇలా ప్రతిరోజు తాగేసి వస్తే, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు ఏమంటారు..? రిషి నీ కోసం బాధపడుతున్నాడు. అన్నం కూడా తినకుండా లేచి వచ్చాడు. రిషి ని చూస్తే కడుపు తరుక్కుపోతోంది అని దేవయాని. మొదలు పెడుతుంది బాధలో తన తండ్రి ఇదంతా చేస్తున్నాడని, రిషి వదిలేయమని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ దేవయాని ఊరుకోదు.
బాధ ఉందని మనుషుల్ని పట్టించుకోకుండా, ముందు వెనక చూడకుండా మందు తాగుతూ కూర్చుంటామా అని మహేంద్ర ని నానా మాటలు అంటుంది దేవయాని. జగతి చనిపోయిన బాధ, తనకి కూడా ఉందని, నేను కూడా మందు తాగాలా..? అని మహేంద్ర చేతిలో బాటిల్ తీసుకోవడానికి చూస్తుంది. ఇది ఇల్లో, బార్ ఓ తెలియట్లేదు అని.. బుద్ధి చెప్పాల్సిన అన్నకి మాట రాదు. నీకు తండ్రి అని, అనడానికి నోరు రాదు అని కోప్పడుతుంది దేవయాని. అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న రిషి, తండ్రిని దేవయాని ఇన్ని మాటలు అనడంతో సహించలేక పోతాడు.
చిన్న విషయానికి ఎందుకు అలా అరుస్తారు అని దేవయానని నిలదీస్తాడు. దేవయాని మాత్రం మండిపడుతూనే ఉంటుంది. ఈ ఇంట్లో నా మాటకు విలువ లేదా..? పెద్దదాన్ని ఒక మాట చెప్తే, కనీసం అర్థం చేసుకోరు. పట్టించుకోరు అని అంటుంది. మహేంద్ర ఏం అర్థం చేసుకోవాలో చెప్పండి అని దేవయానిని అడుగుతాడు. మోసాలు బయటికి చెప్పలేనప్పుడు కుట్రలు బయట పెట్టలేనప్పుడు, మనుషులే రాక్షసులై ప్రాణాలు తీస్తున్నప్పుడు తాగాలి. మరీ ముఖ్యంగా రాక్షసులు మన చుట్టూనే ఉంటే, కచ్చితంగా తాగాలని మహేంద్ర చెప్తాడు. శైలేంద్ర అతని మాటలు విని కంగారు పడతాడు.
నేను పడుతున్న బాధ పోవాలంటే, మందు నాకు కావాలి అని అంటాడు మహేంద్ర. దేవయాని మాత్రం, మహేంద్ర ఇలా తాగుతూ ఉంటే ఈ కుటుంబం మర్యాద పోతుంది. హుందాగా ఉండే, ఇంటి మీద నలుగురు ఉమ్మేస్తారు అని అవమానిస్తుంది. రోజు తాగి వచ్చి, రభస చేస్తానంటే తను చూస్తూ ఊరుకోలేను అని అంటుంది దేవయాని. ఈ క్షణమే ఇంటి నుండి వెళ్లిపోతా అని బయటికి వెళ్లబోతుంది. మీరు ఎక్కడికీ వెళ్ళక్కర్లేదు తామే ఇంటి నుండి వెళ్ళిపోతామని అంటాడు. మా వల్ల ఎవరు ఇబ్బంది పడడం తలదించుకోవడం చూడలేని రిషి అంటాడు. మహేంద్ర వినే పరిస్థితిలో లేడని అంటున్నా నానా మాటలు అని బాధ పెడుతున్నారు అని రిషి ఎమోషనల్ అవుతాడు.
నా ముందు, నా తండ్రిని ఇన్ని మాటలు అంటుంటే, గుండె మిగిలిపోతోంది అని చెప్తాడు. రిషికి ఫణీంద్ర సర్ది చెప్పబోతాడు. మా డాడ్ వల్ల కుటుంబ పరువు పోతుందని పెద్దమ్మ అంది. ఆ పరువు పోకూడదు అంటే, నాన్న ఇంట్లో నుండి వెళ్లిపోవడమే కరెక్ట్ అని ఫణింద్ర తో రిషి చెప్తాడు. కుటుంబ గౌరవం నిలబెట్టాల్సిన బాధ్యత నాపై కూడా ఉందని, తండ్రిని తీసుకుని ఇంటి నుండి వెళ్లిపోతానని రిషి చెప్తాడు. పెద్దమ్మ మాటలు నా గుండెని బలంగా తాకాయి. ఇంట్లో ఉండలేను అని రిషి అంటాడు. లగేజ్ ప్యాక్ చేయమని వసుధారా తో రిషి చెప్తాడు. కానీ రిషికి సర్దు చెప్పబోతుంది వసుధార.
ఆమె కూడా సీరియస్ అవుతాడు. శైలేంద్ర మాత్రం ఇంటి నుండి వెళ్లద్దని బతిమాలినట్లు నాటకం ఆడతాడు. రిషి మాత్రం ఒప్పుకోడు. తన తండ్రిని అవమానించిన చోట ఒక్క క్షణం కూడా ఉండలేను అని చెప్తాడు. తాను మహేంద్ర ని అవమానించలేదని, మామూలుగానే మాట్లాడానని దేవయాని అంటుంది. మీరు మాట్లాడిన ప్రతి మాట మనసుని గాయం చేశాయి అని దేవయానితో అంటాడు రిషి. రిషి వసుధారా ని ఇంటి నుండి పంపించేసి తప్పు చేశావని తల్లి మీద మండిపడతాడు శైలేంద్ర. కళ్ళ ముందు వాళ్ళు ఉంటే, వేసే ఎత్తులు ఈజీగా కనిపెట్టొచ్చని ఇప్పుడు వసుధారా ఏం చేస్తుందో ఏమో అని కంగారు పడతాడు. ఫణింద్ర కూడా దేవయానిపై కోప్పడతాడు.
చాలాసార్లు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పాను కానీ వినిపించుకోలేదని అంటాడు. రిషి ని ఇంట్లో నుండి దగ్గరుండి వెళ్లగొట్టానా..? వాళ్ళు అలిగి వెళ్లిపోతే తనది తప్పు అనడం కరెక్ట్ కాదని ఆమె అంటుంది. అప్పుడు జగతి ఇంట్లో నుండి వెళ్లిపోవడం కారణం నువ్వే. ఇప్పుడు నా తమ్ముడు వెళ్లిపోవడానికి కారణం నువ్వే. కొన్ని బతుకులు మారవు అని దేవయానని అసహ్యించుకుంటూ, కోపంగా అక్కడి నుండి ఫణింద్ర వెళ్ళిపోతాడు.
తన తండ్రిని తన వైపు తిప్పుకోవడానికి ఇన్నాళ్లు వేసిన ప్లాన్స్ మొత్తం పాడుచేసావని, తల్లి మీద కోప్పడతాడు శైలేంద్ర. అందరూ తననే తిట్టడంతో బాధలో మునిగిపోతుంది దేవయాని. అప్పుడే అక్కడికి వచ్చిన ధరణి కాఫీ కావాలా అని ఆమెని ఆటపట్టిస్తుంది. ఎవరి మీద కోపం చూపించాలో తెలియక, ధరణి మీద కూడా ఎగిరి పడుతుంది దేవయాని. తండ్రిని తీసుకుని సిటీలో ఉన్న ఇంకో ఇంటికి వస్తాడు రిషి. మహేంద్ర పరిస్థితిని చూసి బాధపడతాడు. వసుధార ఓదారుస్తుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.