Guppedantha Manasu October 12th Episode : అపార్థం చేసుకున్నందుకు, వసుధారకి రిషి క్షమాపణ చెప్తాడు. ఎప్పటికీ ఆమె చేయని వదలనని మాటిస్తాడు రిషి. ఆ తర్వాత ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. కాలేజీ ఎండి పదవిని తిరిగి చేపట్టమని, రిషిని కొరతారు. కానీ రిషి దానికి ఒప్పుకోడు తనపై నింద వేయడానికి కారణమైన వాళ్ళు ఎవరో తెలిసే వరకు, ఆ పదవిని చేపట్టడం ఇష్టం లేదని చెప్తాడు. తల్లి జగతి చనిపోయిన బాధనుండి కోలుకోకపోవడంతో, తనకి కొంత సమయం కావాలని రిషి చెప్తాడు. అతనిని చక్రపాణి ఓదారుస్తారు. జగతి ఇన్నాళ్ల నుండి కూడా మీ ప్రేమ కోసమే చూస్తోందని, ఎప్పటికైనా కొడుకు తనని అర్థం చేసుకుంటాడని, కొడుకు ప్రేమను పొందుతానని ఆశగా చూస్తోందని రిషి తో అంటాడు చక్రపాణి.
టీచర్ అమ్మని అర్థం చేసుకుని, ఆమెని మీరు అంగీకరించారు. ఆ క్షణం ఇన్నాళ్లుగా ఎదురుచూసిన ఆమె నిరీక్షణ ఫలించింది. జగతి అడగగానే, తనకోసం వస్తారని పెళ్లి చేసుకొని, తల్లి కోరికని నెరవేర్చారని చక్రపాణి ఎమోషనల్ అవుతాడు. మీ మనస్సుకి ప్రశాంతత వచ్చినప్పుడు, జగతి దూరమవ్వడం బాధగా ఉందని చక్రపాణి రిషి తో చెప్తారు. అక్కడికి దేవయాని వచ్చి, చక్రపాణి మీద ఫైర్ అవుతుంది. అతనిది అంతా నటన అని కొట్టి పారేస్తుంది. లోపల ఒకటి, బయట ఇంకొకటి పెట్టుకుని మాట్లాడుతున్నారని… మనసులో ఏం లేదు కానీ నటిస్తున్నారని.. ఎగతాళి చేస్తుంది.
ఇంత జరుగుతున్న ఆమె భార్య సుమిత్ర, కూతురు పెళ్లికి ఎందుకు రాలేదని నిలదీస్తుంది. దేవయాని అడిగిన ప్రశ్నలకు మౌనంగా ఉండిపోతాడు చక్రపాణి. జగదిని చివరిసారిగా చూడడానికి ఎందుకు రాలేదని, చక్రపాణిపై మాటలని జారుతుంది దేవయాని. జగతి మేడం అంటే నా భార్య సుమిత్ర కి చాలా అభిమానం అని దేవయానికి చెప్పబోతాడు చక్రపాణి. కానీ, దేవయాని అసలు పట్టించుకోదు. జగతి మీద అంత అభిమానం ఉంటే, ఒకసారి పలకరించాలి కదా అని అంటుంది.
ఆమె మాటలకి కోపంగా, తను బతికి ఉంటే కదా రావడానికి అని అంటాడు చక్రపాణి. జగతి కంటే ముందే, తన భార్య చనిపోయిందని చెప్తాడు. అతని మాటలకి రిషి షాక్ అవుతాడు. ఈ విషయాన్ని మీకు చెప్పాలని అనుకున్నాను. కానీ, వసుధార వద్దని చెప్పిందని చక్రపాణి చెప్తాడు. రిషికి అమ్మ చనిపోయిన విషయం తెలిస్తే, తన మీద సానుభూతి చూపిస్తాడని, సానుభూతి కంటే తన ప్రేమ కావాలని, అమ్మ చనిపోయిన విషయం చెప్పకుండా ఉంచమని వసుదారా చెప్పిందని చక్రపాణి వివరిస్తాడు.
బాధలో ఉన్న మిమ్మల్ని, మరింత బాధ పెట్టడం ఇష్టం లేక వసుధార ఇలా చేసిందని అంటాడు. వసుధార తల్లి చనిపోయిన విషయం తెలియక, గతంలో ఆమెని మాటలతో అవమానించిన విషయం గుర్తు రావడంతో రిషి పశ్చాత్తాప పడతాడు. వసుధార వస్తుంది. ఎండి పదవి చేపట్టే విషయంలో, ఎక్కువగా ఆలోచించద్దని, ఆ సీట్లో కూర్చోమని రిషి తో చెప్తుంది. దానికి నా మనసు అంగీకరించట్లేదని, రిషి చెప్తాడు. కాలేజీకి ఇప్పుడు మీ అవసరం ఉంది. పడిన మచ్చ త్వరలో తొలగిపోతుంది. పంతానికి పోతే, కాలేజీ చేయి దాటి పోతుందని రిషికి చెప్తుంది.
కాలేజీకి వస్తే అమ్మ గుర్తుకు వస్తుంది. తనతో గడిపిన క్షణాల గుర్తు వస్తాయి. అమ్మలేని కాలేజీలో అడుగుపెట్టలేనని రిషి అంటాడు. రిషి మాటలు విని వసుధర ఓదరుస్తుంది. అమ్మను పోగొట్టుకుని, ఆ బాధను బయటకు కనపడకుండా గుండెల్లోనే దాచుకొని ముందుకు సాగిపోవడానికి, నేను వసుధారని కాదని చెప్తాడు రిషి. నీ బాధని పంచుకోవడానికి కూడా నేను పనికిరానా అని రిషి అంటాడు. అమ్మ చనిపోవడానికి పరోక్షంగా తానే కారణమని వసుధార ఏడుస్తుంది. తను చెప్పిన అబద్ధపు సాక్ష్యం వల్ల, మీరు నన్ను వదిలేసి వెళ్లిపోయారు. ఆ నిజం తెలియగానే అమ్మకి హార్ట్ ఎటాక్ వచ్చిందని చెప్తుంది.
ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రిషి వచ్చినట్లు, ఎన్వోసీ మీద తానే సైన్ చేసినట్టు చెప్తుంది. ఆ రోజే అమ్ము చనిపోయింది అని చెప్తుంది. అమ్మ చనిపోయిన బాధ, రిషి దూరమైపోయినప్పుడు తండ్రి ఊరికి తీసికెళ్ళడం, తర్వాత విష్ కాలేజీలో ఎలా చేరిందని రిషికి చెప్తుంది. నా ప్రాణాలను కాపాడింది నువ్వని తెలియలేదంటాడు. అలానే, తాను చేసిన తప్పులు చెప్పి ఎమోషనల్ అవుతాడు. ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వలన, మీ అమ్మతో పాటుగా మా అమ్మని కోల్పోయానని బాధపడతాడు.
అలానే. నీలాంటి అమ్మాయి ప్రేమని పొందడం నా అదృష్టం అని చెప్తాడు రిషి. ఇక నుండి నువ్వు నేను వేరు వేరు కాదు అని చెప్తాడు. మన బంధాన్ని ఎవరు వేరు చేయలేరని కూడా చెప్తాడు. గుండెలోనే బాధను మోస్తూ, అనుక్షణం నన్ను కాపాడావు. నువ్వు గొప్ప దానివి అని అని, ప్రశంసలు కురిపిస్తాడు రిషి. మీరు నా ఎండి గారు. మీ మంచి, చెడులు చూసుకోవడం నా బాధ్యత అని వసుధార అంటుంది. అమ్మ శిష్యురాలుగా, నా హెచ్ఎం గా నిన్ను ఎప్పుడూ గుండెలో దాచుకుంటానని ఆమెకి మాట ఇస్తాడు. ఇక ఏ స్థాయిలో నువ్వు ఉండాలో నాకు తెలుసు అని చెప్తాడు. అక్కడే నిన్ను కూర్చోబెడతానని కూడా చెప్తాడు. నాకు ఏ స్థాయి వద్దు నా పక్కన మీరు ఉంటే చాలు అని చెప్తుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.