వినోదం

Guppedantha Manasu October 11th Episode : టెన్షన్ లో దేవయాని.. శైలేంద్ర‌కు వ‌సుధార షాక్.. రిషి ప్రాణాలకి ప్రమాదమా..?

Guppedantha Manasu October 11th Episode : వసుధార శైలేంద్ర కుట్రలని, అతని ద్వారానే బయటపెట్టాలని అనుకుంటుంది. తెలివిగా రిషితో పాటు, ఫణింద్ర ముందు ఇరికించే ప్రయత్నం చేస్తుంది. కాలేజీ ఎండి బాధ్యతలని తిరిగి చేపట్టమని, రిషిని అడుగుతాడు ఫణింద్ర. అయితే, వచ్చిన నింద కారణంగా పదవి చేపట్టడానికి రిషి ఆలోచనలో పడతాడు. మీ మీద తాను మోపిన నింద అబద్ధమని, తాను మినిస్టర్ ముందు ఒప్పుకున్నట్లు వసుధారా అంటుంది. మిషన్ ఎడ్యుకేషన్ ఫండ్స్ ని మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కోసం వాడుకున్నట్లు వచ్చిన ఆరోపణలు, నిజం కాదని రిషితో చెప్పడం జరుగుతుంది. అబద్ధం అని నాకు తెలుసు. కానీ, ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది..? ఎవరి వల్ల చెప్పాల్సి వచ్చింది అనేది తెలియాలి అని రిషి అంటాడు.

పోలీసులకి ఆ విషయం కూడా చెప్పానని, వసుధార అంటుంది. ఆమె మాటలు విని దేవయాని శైలేంద్ర కంగారు పడతారు. మీరు ఎందుకు కంగారుపడుతున్నారని దేవయానిని అడుగుతుంది వసుధార. ఏమీ లేదు. ఎవరికి చెప్పావు…? ఉండబట్టలేక అడిగానని, మాటలు మార్చేస్తుంది దేవయాని. తనకి చెక్ ఇవ్వమని జగతి మేడం చెప్పారని అంటుంది. ఆమె మాటలు విని, కాస్త రిలీఫ్ అవుతాడు. రిషి షాక్ అయిపోతాడు. రిషి ప్రాణాలని కాపాడుకోవాలంటే, అబద్ధం చెప్పాలని తనని జగతి బతిమిలాడిందని, మీ మీద అటాక్స్ చూసి, భయపడి మేడం చెప్పినట్లుగా తాను అబద్ధం ఆడానని వసుధారా ఒప్పుకుంటుంది.

అటాక్ జరగడం, పూలకుండి పడడం ఇవన్నీ జగతిని భయపెట్టడానికి ప్లాన్ ప్రకారం, శత్రువులు చేసిన కుట్ర అని వసుధర అంటుంది. జగతిని ఎవరు భయపెట్టారో వెంటనే తెలుసుకోవాలని, రిషి కోపంగా చెప్తాడు. జగతి లేదు కదా మరి ఎలా పట్టుకుంటామని అంటే, శైలేంద్ర సహాయంతో అతన్ని పట్టుకోవచ్చని చెప్పి పెద్ద ట్విస్ట్ ఇస్తుంది వసుధార. శైలేంద్ర ద్వారానే అతన్ని బయటపెట్టాలని అంటుంది.

Guppedantha Manasu October 11th Episode

బిల్డింగ్ కాంట్రాక్టర్ సారధికి చెక్ ఇస్తే, అతను ముందు మనల్ని కలవాలి. కానీ, మినిస్టర్ ని కలిసాడు అంటే ఏదో తిరకాసు ఉంటుంది అని చెప్తుంది వసుధార. సారధి శైలేంద్ర కి మంచి స్నేహితుడు. సైలేంద్ర ద్వారా అతన్ని పట్టుకుంటే, నిజాలు మొత్తం బయటపడతాయి అని వసుధార చెప్తుంది. రేపు అతనికి ఫోన్ చేస్తానని శైలేంద్ర చెప్తాడు. రేపు కాదు ఇప్పుడే శైలేంద్ర కి ఫోన్ చేయమని వసుధార అంటుంది. జగతి గుర్తు రావడంతో మహేంద్ర బాగా ఎమోషనల్ అవుతాడు.

ఎందుకు బాధలు, కన్నీళ్లు మిగిల్చావు..? ఎందుకు ఇలా చేశావు..? తిరిగి వచ్చే అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. తాగిన మత్తులో మెట్ల మీద నుండి దిగబోతు పడబోతాడు. రిషి అతన్ని సేవ్ చేస్తాడు. ఏం కాలేదు కదా అని అంటాడు. మీ అమ్మ చనిపోయిన రోజు, నేను కూడా చనిపోయాను. ప్రమాదం జరగడానికి ఇంకేముంది అని అంటాడు. మహేంద్ర దుస్థితిని చూసి, ఫణీంద్ర బాగా బాధపడతాడు. మీరు బాగుండాలి. క్షేమంగా ఉండాలి అని కోరుకోవడం వల్లే తనకి అలాంటి పరిస్థితి వచ్చిందని, అన్నయ్యతో అంటాడు మహేంద్ర. దేవయాని ఆ మాటలతో భయపడుతుంది. నిజం చెప్పేస్తాడేమి అని కంగారు పడిపోతుంది.

నా బాగు కోరుకోవడం వల్ల, ఈ పరిస్థితి రావడం ఏంటని మహేంద్రని అడుగుతాడు ఫణీంద్ర. నిజం చెప్పడు మహేంద్ర. మనసులోని మాట, అలా బయటకు వచ్చింది. అది అబద్ధమో నిజమో నీ ఊహకే వదిలేస్తున్నానని చెప్తాడు మహేంద్ర. మహేంద్ర ఇక్కడే ఉంటే ప్రమాదం అని ఊహిస్తుంది దేవయాని. మత్తులో ఉండి.. ఏదేదో మాట్లాడుతున్నాడని చెప్తుంది. అతని రూమ్ లోకి తీసుకెళ్ళమని రిషికి చెప్తుంది. మహేంద్ర మత్తులో ఉన్నవాడే, నిజాలు మాట్లాడతాడని దేవయానిపై సీరియస్ అవుతాడు.

సారధి వచ్చి నిజం చెప్పేస్తే, కొంప మునిగిపోతుందని దేవయాని టెన్షన్ పడుతుంది. శైలేంద్ర తల్లికి ధైర్యం చెప్తాడు. నీ కొడుకుని అంత తక్కువ అంచనా వేసావా..? ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించి, సారథిని ఫారిన్ పంపించాను అంటాడు. కొడుకు మాటలతో దేవయాని రిలీఫ్ అవుతుంది. వసుధారని చూస్తే, నిజాలు బయటపెట్టేలా ఉందని జాగ్రత్తగా ఉండాలని, సైలేంద్రకి సలహా ఇస్తుంది.

రిషి ని లేపడానికి ప్లాన్ చేశా.. ఈ వాసుధారా ఎంత..? ఇద్దర్నీ కలిపి లేపిస్తాను అని శైలేంద్ర తల్లికి చెప్తాడు. రిషి కాలేజీ ఎండి బాధ్యతలు చేపట్టడానికి, మినిస్టర్ ఇంటికి వచ్చి ఒప్పిస్తాడు. జగతి ఆశయాన్ని నువ్వే ముందుకు తీసుకెళ్లాలని, రిషి ని కోరుతాడు. ఏ దేశంలో సారథి వున్నా పట్టుకుని అతని చేత నిజాలని చెప్పిస్తానని అంటాడు. నిందపడిన చెక్ విషయంలోని, సంతకాలు ఫోర్జరీ అని తెలిసిందని, ఫణీంద్ర ఆ రిపోర్ట్లని రిషికి చూపిస్తాడు.

నీ ప్రాణాలని కాపాడటం కోసం జగతి, వసుధారా అబద్దాలు చెప్పారని అవన్నీ మనసులో నుండి తీసేయమని రిషి తో అంటాడు మినిస్టర్. ఎండి బాధ్యతలు స్వీకరించి, కాలేజ్ ని నిలబెట్టమని, జగతి ప్రాణ త్యాగం చేసిందని, మినిస్టర్ కన్విన్స్ చేస్తాడు. ఎండి పదవి చేపడితే కానీ కాలేజీ కుదుటపటని కోరుతాడు. ఫణింద్ర కూడా మినిస్టర్ అభిప్రాయం సరైనది అని చెప్తాడు. దేవయాని కూడా భర్తని సమర్థిస్తూ, రిషి ఆ సీట్ లో కూర్చోవాలని అబద్ధం ఆడుతుంది. కచ్చితంగా కాలేజీకి వస్తాడు. ఎండి సీట్లో కూర్చుంటాడు అని శైలేంద్ర మినిస్టర్ కి మాటిస్తాడు. రిషి మాత్రం మౌనంగానే ఉంటాడు. కొంత టైం కావాలని చెప్తాడు. టైం తీసుకుని సరైన నిర్ణయం ఏంటో చెప్పమంటాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM