Guppedantha Manasu November 2nd Episode : అనుపమ జగతి, మహీంద్ర జ్ఞాపకాల్లో ఉండిపోతుంది. వాళ్ళిద్దరితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటుంది. ఆమె పడుతున్న బాధ చూసి, పెద్దమ్మ బాగా ఎమోషనల్ అవుతుంది. ఆ జ్ఞాపకం నుండి, బయట పడాలంటే, నువ్వు జగతి మహేంద్ర జీవితంలోకి వెళ్లాలని అనుపమకి చెప్తుంది. గతంలోకి వెళ్ళినప్పుడే, జీవితం కొత్తగా మొదలవుతుందని చెప్తుంది. నువ్వు అందర్నీ వదిలేసి దూరంగా వెళ్లిపోయావు. ఎవరినైతే వదిలేసావో వాళ్ళని మళ్లీ కలువు. నువ్వు వాళ్లతో, కలిసి ముందుకు వెళ్తేనే, సంతోషంగా ఉంటావు అని చెప్తుంది. నువ్వు హ్యాపీగా ఉంటావని, అనుపమ కి పెద్దమ్మ చెప్పగా, మహేంద్ర ని కలిసిన తర్వాత నువ్వు నువ్వుల ఉండలేకపోతున్నావని కూడా చెప్తుంది.
నిన్ను చూస్తే ఏమైపోతావో అని భయంగా ఉందని అంటుంది. ఆమె మాటలతో, అనుపమ కన్విన్స్ అవుతుంది. వెంటనే, మహేంద్ర తో మాట్లాడి, అన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటుంది. మహేంద్ర నార్మల్ అయిపోతాడు. తాగుడు మానేస్తాడు. రిషితో కలిసి సంతోషంగా భోజనం చేస్తుంటాడు. అప్పుడే, అనుపమ అతనికి ఫోన్ చేస్తుంది. మహేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. మళ్లీ మళ్లీ కాల్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయమని తండ్రితో అంటాడు రిషి. ఇంపార్టెంట్ కాల్ కాదని, రిషికి చెప్తాడు. అనుపమ ఫోన్ కాల్స్ కారణంగా భోజనం మధ్యలోనే ముగించి మహేంద్ర లేస్తాడు. భోజనం చేయడానికి ముందు, రిషి వసుధారలతో బాగా మాట్లాడిన మహేంద్ర, ఒక్కసారిగా మారతాడు. కంగారు పడతాడు.
తండ్రిని చూసి ఆలోచనలో పడతాడు. ఏదో సందేహం వస్తుంది. అనుపమ అంటే అరకులో కలిసిన ఆవిడే కదా అని అంటాడు వసుధారతో. తండ్రికి గతంలోనే, అనుపమతో పరిచయం ఉందా..? ఆమె ఫోన్ చేస్తే, మహేంద్ర ఎందుకు ఇలా కంగారు పడుతున్నాడు అని అనుమానం వస్తుంది. ఈ విషయాలను మనకి డాడ్ ఎందుకు చెప్పట్లేదు అని అనుకుంటాడు. ఈ విషయాలన్నీ మహేంద్రని అడిగితే, బాగుంటుందని రిషి అంటాడు. ఈ సంగతులని అనుపమని అడిగి, తాను తెలుసుకుంటానని వసుధార చెప్తుంది. కానీ రిషి వద్దని చెప్తాడు.
వాళ్ళ మధ్య ఏం జరిగింది..?, ఇప్పుడు ఏం జరుగుతుందనేది తెలిస్తే మనకి ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందని అంటాడు. రిషి ని కన్విన్స్ చేస్తుంది వసుధారా. రిషి ఒప్పుకుంటాడు. దేవయానిని కలవడానికి రిషి వెళ్తాడు. ఆ విషయం తెలిసి, మహేంద్ర కంగారు పడతాడు. రిషిని శైలేంద్ర, దేవయాని ఏం చేస్తారో అని భయపడిపోతూ ఉంటాడు. జగతి చావుకి పరోక్షంగా కారణం తెలిసి ఏం చేయలేకపోతున్నాను అని బాధపడతాడు మహేంద్ర. రిషి ముందు ప్రేమని నటిస్తూ, వాళ్ళ మనసులో మాత్రం విషం నాటుకున్నారని, వాళ్లు రాక్షసులని అంటాడు మహేంద్ర.
వాళ్ళు చేసిన నేరాలు-ఘోరాలు అన్నీ తెలిసిన రిషికి చెప్పలేకపోతున్నానని, బాధపడతాడు. శైలేంద్ర దేవయాని లను రిషి కలిస్తేనే, వాళ్ళ నిజస్వరూపం ఏమిటి అనేది తెలుసుకోగలనని మహేంద్ర తో వసుధార అంటుంది. ఎండి సీట్ దక్కలేదని శైలేంద్ర ఫ్రస్టేషన్లో ఉన్నాడని, మహేంద్ర తో అంటుంది. ఆ కోపంలో ఏదో ఒక తప్పు చేస్తాడు, ఆ తప్పుని రిషి గుర్తిస్తే దేవయాని, శైలేంద్ర కుట్రలు మొత్తం బయటపడతాయని అంటుంది. ఆ దుర్మార్గులని రిషి ఎలా శిక్షిస్తాడో చూడాలన్నదే, తన జన్మకి మిగిలి ఉన్న ఒకే ఒక ఆశ అని అంటాడు మహేంద్ర. జగతిని చంపిన వాళ్ళు ఎవరైనా సరే క్షమించే ప్రసక్తే లేదని ఇదివరకు రిషి తనతో చెప్పాడని మహేంద్ర ఆవేశానికి లోనవుతాడు.
పదవి కోసం ఎన్నో ఘోరాలు చేసిన వాళ్ళని రిషి శిక్షించకపోతే న్యాయం బతకదని మహేంద్ర అంటాడు. శైలేంద్ర, దేవయాని ల గురించి తెలిసి, వాళ్లని రిషి వదిలేస్తే దేవుడు క్షమించడని వసుధారతో అంటాడు మహేంద్ర. అప్పుడే రిషి వస్తాడు. దేవయాని దగ్గరికి వెళ్ళబోతున్నట్లు రిషి చెప్తాడు. వసుధారా వస్తానని అంటుంది. తండ్రి గురించి ఆలోచించి వద్దు అని చెప్తాడు. ఆమె కూడా సరే అని అంటుంది. రిషి రాగానే యాక్టింగ్ మొదలుపెడతారు. రిషి పై ప్రేమని కురిపించడం మొదలు పెడతారు. చాలా చిక్కిపోయావని ఎమోషనల్ అవుతాడు.
మహేంద్ర రాలేదా అని అడుగుతుంది. క్షమాపణ చెప్పాలి అని అంటుంది దేవయాని. తండ్రి రాలేదని చెప్తాడు రిషి. రిషి పై ప్రేమని బాగా కురిపిస్తుంది. కనీసం వసుధార వచ్చినా బాగుండేదని అంటుంది. నేను వచ్చాను అని చెప్పి వసుధార షాక్ ఇస్తుంది. నేను రానని అనుకున్నారా, రాలేనని అనుకున్నారా అని ఆమె అంటుంది. రిషిని అలా ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది దేవయాని. అప్పుడే అక్కడికి వచ్చిన ఫణింద్ర రిషి బుర్ర తినడం ఆపేయమని అంటాడు. మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలని ఫణింద్ర తో అంటాడు రిషి.
ఎవరు ఆ స్పెషల్ పర్సన్ అని ఎదురు చూస్తారు. రిషి ఫోన్ చేయగానే ఒక వ్యక్తి ఇంట్లోకి వస్తాడు. అతని పేరు ముకుల్. జగతి మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్పెషల్ గా అపాయింట్మెంట్ అయిన ఆఫీసర్ అని ఫణింద్ర కి పరిచయం చేస్తాడు రిషి. అతన్ని చూడగానే దేవయాని, శైలేంద్ర కంగారు పడతారు. జగతి చనిపోయిన రోజు ఇంటి నుండి ఆమె బయటకు వచ్చిన విషయం తనకి తప్ప ఎవరికీ తెలియదు అని ముకుల్ తో అంటాడు. ఆ విషయం బయట వాళ్లకి ఎలా తెలిసిందో అర్థం కావట్లేదని అంటాడు. చుట్టుపక్కల వాళ్ళని అవసరమైతే మన అనుకున్న వాళ్ళని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని ముకుల్ కి సలహా ఇస్తుంది వసుధార. ఆమె మాటలతో దేవయాని శైలేంద్ర కూడా కంగారు పడిపోతారు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…