Guppedantha Manasu November 21st Episode : అనుపమ జగతి మర్డర్ గురించి, ఎంక్వయిరీ చేయడం మొదలు పెడుతుంది. వసుధార వలనే జగతి చనిపోయిందని, అనుపమని నమ్మిస్తారు శైలేంద్ర, దేవయాని. జగతిని అమ్మ అని పిలవకుండా, రిషి బాధపెట్టాడని అబద్ధం ఆడుతుంది. మహేంద్ర కూడా జగతిని పట్టించుకోలేదని చెప్తారు. జగతి గురించి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పడంతో, నిజాలు ఏంటో తానే తెలుసుకోవాలని అనుకుంటుంది. శైలేంద్ర దేవయాని దగ్గర నుండి నేరుగా మహేంద్ర దగ్గరికి అనుపమ వెళ్తుంది. సీక్రెట్ గా శైలేంద్ర ఆమెని ఫాలో అవుతాడు.
శైలేంద్ర, దేవయాని అనుపమను కలిసిన విషయం ధరణి ద్వారా వసుధారకు తెలుస్తుంది. తర్వాత అనుపమ మహేంద్ర దగ్గరికి వెళ్లి, అతని మీద కూడా ఫైర్ అవుతుంది. అనుపమ మహేంద్ర మాటల్ని శైలేంద్ర వింటాడు. అనుపమ మాటలతో, మహేంద్ర కోపంతో ఎగిరిపోతాడు. ప్రేమించిన జగతిని ఎలా దూరం పెట్టావని నిలదీస్తుంది. జగతిని ఎందుకు వేధించావని మహేంద్రని అడుగుతుంది. ఆమె చచ్చిపోయేలా చేసావని మహేంద్ర పై ఫైర్ అవుతుంది అనుపమ. అప్పుడే రిషి వసుధార ఇంటికి వస్తారు.
వాళ్ళని చూసి శైలేంద్ర దాక్కుంటాడు. అనుపమ మాటలు విని తట్టుకోలేకపోతున్నాను. ఇంకా ఎందుకు బతికి ఉన్నాను అని అనిపిస్తోందని బాధపడతాడు మహేంద్ర. జగతి మహీంద్ర హ్యాపీగా ఉండాలని, తానే వాళ్ళ పెళ్లి చేసినట్లు రిషి వసుధారలతో అనుపమ చెప్తుంది. ఇద్దరు ఓడిపోయారని తెలిసి చాలా బాధపడ్డాను వాళ్ళని కలపాలని అనుకున్నాను అని రిషితో అనుపమ అంటుంది. మహేంద్రని ఏమి అనద్దు అని జగతి ఒట్టు వేయించుకుందని అందుకే ఇన్నాళ్లుగా మౌనంగా ఉండిపోయానని అనుపమంటుంది. జగతి లేనప్పుడు, ఇంకా ఒట్టుకి విలువ ఏముందని చెప్తున్నాను అని అనుపమంటుంది.

శైలేంద్ర చాటుగా మాటలు వింటుంటాడు. ఫోన్ మోగుతుంది. దొరికిపోకుండా ఉండడం కోసం, పక్కనే ఉన్న నల్ల రంగు ముఖానికి రాసుకుంటాడు. పారిపోవడానికి ప్రయత్నిస్తాడు శైలేంద్ర. కానీ బండి స్టార్ట్ కాదు. దాంతో తోసుకుంటూ వసుధార ఇంటి నుండి పారిపోతాడు. అతన్ని వసుధారా గుర్తుపడుతుంది. క్లారిఫై చేసుకోవడం కోసం ధరణికి ఫోన్ చేసి కనుక్కుంటుంది. బైక్ స్టార్ట్ అవ్వకపోవడంతో, తోసుకుంటూ రోడ్డు మీద నడుస్తుంటాడు.
మెకానిక్ ఎదురవుతాడు. బైక్ బాగు చేస్తానంటూ శైలేంద్ర వద్ద వెయ్యి రూపాయలు తీసుకుంటాడు. డబ్బులు తీసుకుని కీ ఆన్ చేసి స్టార్ట్ చేయమని చెప్పి వెళ్ళిపోతాడు. వసుధార పెట్టిన టెన్షన్ లో తాళం తిప్పలేదని గుర్తొచ్చి, శైలేంద్ర సహించలేక పోతాడు. నాన్న మీ మాటలకి బాగా బాధపడ్డారని, రిషి అనుపమతో చెప్తాడు. కొన్ని పరిస్థితుల వల్ల తల్లికి తన తండ్రి దూరమయ్యాడని అనుపమతో రిషి చెప్తాడు.
తర్వాత శైలేంద్ర వాళ్ళు చెప్పినవి నిజాలా కావో అనుపమ కనుక్కుంటుంది. నిజమే అని తెలుస్తుంది. ముఖానికి రంగు పూసుకుని శైలేంద్ర ఇంటికి వస్తాడు. ధరణి గుర్తుపట్టదు. అడ్డుకుంటుంది. దొంగ అనుకుని కర్రతో కొడుతుంది. ఆపమని శైలేంద్ర బతిమిలాడుతాడు. అతని గొంతు గుర్తు పట్టి కొట్టడం ఆపేస్తుంది. తప్పైపోయిందని చెప్తుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.