Guppedantha Manasu December 22nd Episode : వసుధర ఎండి సీట్ నుండి తప్పించుకోవాలని నిర్ణయం తీసుకుంది. రిషి విషయంలో నిన్ను ఎవరో బెదిరించడం వల్లే, నువ్వు ఈ నిర్ణయం తీసుకుంటున్నామని మహేంద్ర అంటాడు. ఇలాంటి నిర్ణయం సరికాదని అంటాడు. నా తర్వాత కాలేజీని సమర్థవంతంగా నడిపించేది శైలేంద్ర భూషణ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎండి పదవికి తానే అర్హుడని అనుకుంటున్నానని వసుధార చెప్తుంది. తన అభిప్రాయం ఏంటో తెలియాలి కదా అని బోర్డ్ మెంబర్స్ అంటారు. నాకు పదవులపై వ్యామోహం లేదు. కానీ, ఈమె నమ్మకం పెట్టుకుంది కాబట్టి కాదని లేకపోతున్నానని శైలేంద్ర అంటాడు. తన సమక్షంలో ఎండి సీట్ లో కూర్చుంటే, సంతోషంగా ఉండేవాడు.
ఇంతకుముందు కూడా తాను దగ్గర ఉండే, ఆ సీట్లో కూర్చోపెట్టాడని శైలేంద్ర అంటాడు. నేను డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి, తీసుకు వస్తానని వసుధార అంటుంది. మురిసిపోతాడు శైలేంద్ర. వసుధార లోపాలకి వెళ్తుంది. మహేంద్ర కూడా తన తో వెళ్తాడు. ఎండి సీట్లో కూర్చోబెడుతూ రిషి చెప్పిన జాగ్రత్తలు తలుచుకుని, వసుధార బాధపడుతుంది. ఆ వెనకే వచ్చిన మహీంద్ర, అనుపమ ఇద్దరూ వసుధార మీద ఫైర్ అవుతారు. అనుపమ పదవిని వదిలేయడమేంటి అని అడుగుతుంది.
శైలేంద్ర గాడు నిన్ను బెదిరించి ఉంటాడు. అంతేనా అని మహేంద్ర అంటాడు. ఈ విషయంలో నిర్ణయం మార్చుకోను అని వసుధారా అంటుంది. నేను చెప్పేది వినవా అని అనుపమ అంటుంది. దేవయాని నేను చాలా సంతోషంగా ఉన్నానని అంటుంది. ఇకపై కాలుపై కాలు వేసుకుని కూర్చుని చక్రం తిప్పుతాను అని శైలేంద్ర అంటాడు. అందర్నీ సంతకం పెట్టమంటే, మహేంద్ర ఇష్టం లేకుండానే సైన్ చేస్తాడు. బోర్డు మెంబర్స్ అందరూ కూడా సైన్ చేస్తారు. వసుధార సైన్ చేయడానికి ఆలోచిస్తుంటే, పెట్టమ్మా సంతకం అని అంటుంది దేవయాని.
సారీ మేడం నేను పెట్టలేను అంటుంది. రిషి సార్ సమక్షంలో ఎండి సీట్ లో కూర్చుంటే బాగుండేది అన్నారు కదా..? అందుకే రిషి సార్ ఉన్నప్పుడే ఫైల్ మీద సంతకం పెట్టి సైలేంద్ర గారికి బాధ్యతలు అప్పగించాలి అనుకుంటున్నాను అని వసుధార అంటుంది. అదేదో మామూలుగా అన్నాడు అంటుంది దేవయాని. లేదు బలంగానే అన్నారు ఆయన కోరిక కాదనడం ఎందుకు..? రిషి సార్ వచ్చినప్పుడే, ఎండి సీట్ అప్పగిస్తానని రిషి సార్ వచ్చిన తర్వాత, ఇది జరిగితే బాగుంటుంది అని బోర్డ్ మెంబర్స్ కూడా అంటారు.
మా అబ్బాయి ఎండిని చూస్తే ఏమైపోతుంది అని ఫైర్ అవుతుంది దేవయాని. అందరి ఆమోదం లేకుండా, నిర్ణయం తీసుకోలేము కదా అని మహేంద్ర అంటాడు. రిషి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదామని వసుధారా అంటాడు. నా దగ్గరే నాటకాలు ఆడుతున్నావా..? పిచ్చిపిచ్చిగా ఉందా నవ్వుతున్నావ్ ఏంటి వెటకారంగా ఉందా అని శైలేంద్ర అంటాడు. రిషి నా కంట్రోల్ లోనే ఉన్నాడని చెప్పిన నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావేంటి..? ఏం చేయాలి..? రిషి ని చంపేస్తాను. నువ్వు అతి తొందర్లోనే రిషి చావు వార్త వింటావు చూడు అని శైలేంద్ర అంటాడు.
అంతకన్నా ముందు నువ్వు చచ్చిపోతావ్ అని అంటుంది. ఏం చేస్తావ్ నువ్వు ఏం చేయగలవు..? నేను ఒక ఫోన్ కొడితే అక్కడ రిషి ఫినిష్ అయిపోతాడు అని అంటాడు. ఇప్పుడు శైలేంద్ర కి ఏదైనా జరిగితే నీ పని అయిపోతుంది. నువ్వు బ్రాస్ లైట్ కూడా ఇచ్చావు కదా..? ఈ విషయం అందరికీ చెప్తానని అంటుంది వసుధార. నేను పక్కా ఆధారంతో ఈ విషయం చెప్తాను చూస్తారా అని ఫోన్లో వీడియో చూపిస్తుంది. రిషి నా దగ్గరే ఉన్నాడని చెప్పే వీడియో అది. శైలేంద్ర అది చూసి షాక్ అయిపోతాడు.
ఈ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చిందని అడుగుతాడు. అప్పుడు జరిగిన విషయం గుర్తుకు చేస్తుంది. వసుధార కి కొరియర్ రాగానే హడావిడిగా వెళ్లడం చూసి అనుపమకు అనుమానం వచ్చిందని, చెప్తుంది. అనుపమ అది చూస్తుంది. రికార్డ్ కూడా చేస్తుంది. రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు కదా అని అనుపమ అంటుంది. నన్నే చీట్ చేస్తావా అని శైలేంద్ర అంటే, చీటింగ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా..? నేను నిన్ను చీట్ చేయడం ఏంటి..? నీకు ఎండి సీటు ఇస్తే రిషి సార్ ని అప్పగిస్తా అన్నావ్. నేను అదే చెప్తున్నాను అప్పగించేసాక అప్పుడు ఎండి సీటు ఇస్తాను అంటుంది. పని అవ్వకముందు అందరూ అలానే అంటారు. అందుకే నువ్వు మోసం చేయవని గ్యారెంటీ లేదు అని అంటాడు. వసుధార లాగిపెట్టి కొడుతుంది. రెండు రోజుల్లో రిషి ని తీసుకొస్తే సరి లేదంటే ఈ వీడియో అందరికీ చూపిస్తాను అంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…