Pushpa : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పుష్ప.. పాన్ ఇండియా స్థాయిలో విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. తొలి రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. క్రమ క్రమంగా ఈ మూవీకి ఆదరణ పెరుగుతోంది. అయితే ఈ మూవీలో నటించిన వారితోపాటు పనిచేసిన వారికి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
పుష్ప మూవీ తొలి రోజు రూ.71 కోట్లు రాబట్టగా, రెండో రోజు రూ.45 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ క్రమంలోనే రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.116 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయడం విశేషం. ఇక ఆదివారం కావడంతో 3వ రోజు కలెక్షన్లు బాగానే వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇక పుష్ప మూవీలో నటీనటుల రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. ఈ మూవీకి గాను అల్లు అర్జున్ ఏకంగా రూ.50 కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అలాగే రష్మిక మందన్న రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లు, విలన్‌గా నటించిన మళయాళ నటుడు ఫహద్ ఫాజిల్ రూ.3.50 కోట్లు, దర్శకుడు సుకుమార్ రూ.25 కోట్లను రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రూ.3.50 కోట్లు, ఐటమ్ సాంగ్‌లో నటించిన సమంత రూ.1.50 కోట్లు తీసుకున్నారట. నెగెటివ్ రోల్‌లో నటించిన యాంకర్ అనసూయ ఒక రోజు షూటింగ్‌కు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల మేర తీసుకున్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…