తెలుగులో కమెడియన్ అంటే మొదటగా గుర్తొచ్చే పేరు బ్రహ్మానందం. ఆయన చేసే కామెడీకి ఆఖరికి చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఒకప్పుడు ఆయన లేకుండా దాదాపు ఏ సినిమా ఉండేది కాదు. 30 సంవత్సరాల తన సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాల్లో తన కామెడీతో మన అందరిని నవ్విస్తూనే ఉన్నాడు. అతి తక్కువ సమయంలో 1000కి పైగా సినిమాల్లో నటించిన వ్యక్తి గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు బ్రహ్మానందం. ప్రస్తుతం పలువురు కమెడియన్ లు రావడంతో బ్రహ్మానందానికి కాస్త అవకాశాలు కూడా తగ్గాయని ఇండస్ట్రీలో టాక్ గా ఉంది.
ఆయన ఇటీవల భీమ్లా నాయక్, జాతి రత్నాలు వంటి సినిమాల్లో కీలక పాత్ర నటించారు. ప్రస్తుతం రంగమార్తాండ సినిమాతో పాటుగా పలు క్రేజీ సినిమాల్లో నటిస్తున్నారు. అంతేకాదు తాజాగా బ్రహ్మానందం తన ఆత్మకథ రాస్తున్నారని కూడా పలు వార్తలు వినిపిస్తున్నాయి. బ్రహ్మానందం కేవలం ఒక మంచి నటుడిగానే కాకుండా ఆయనలో ఆర్టిస్టు కూడా ఉన్నాడు. కరోనా సమయంలో బ్రహ్మానందం ఖాళీగా ఉండకుండా తనకు వచ్చిన పెయింటింగ్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం ఒక్కో కాల్ షీట్ కు ఏకంగా రూ. లక్ష చార్జ్ చేస్తున్నారట.
సినిమాలో ఆయన పాత్రను బట్టి ఒక్కోసారి సినిమాకు ఏకంగా రూ. కోటి వరకు పారితోషకం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట. అయితే ఆయన సంపాదనలో సగభాగాన్ని భూములపైన ఇన్వెస్ట్మెంట్ చేసేవారట. ప్రస్తుతం ఆ భూముల ధరలు ఇప్పుడు బాగా పెరిగిపోయినట్లు సమాచారం. దాదాపుగా బ్రహ్మానందం ఆస్తి విలువ 450 నుంచి 500 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన స్నేహితులు మాత్రం బ్రహ్మానందానికి ఎలాంటి దురలవాట్లు లేకపోవడంతోనే ఈ స్థాయిలో ఆస్తులు కూడబెట్టారని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…