Dhootha Web Series Review : నాగ‌చైత‌న్య తొలిసారి న‌టించిన వెబ్ సిరీస్.. దూత‌.. రివ్యూ.. ఎలా ఉంది..?

December 1, 2023 5:44 PM

Dhootha Web Series Review : అక్కినేని నాగ చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన వెబ్ సిరీస్ దూత‌.తొలిసారి విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న ఈ వెబ్ సిరీస్ చేశాడు. 13బి’, ‘ఇష్క్’, ‘మనం’, ’24’ వంటి మెమరబుల్ ఫిల్మ్స్ త‌ర్వాత చైత‌న్య హీరోగా విక్ర‌మ్ కుమార్ అతీంద్రియ శక్తుల నేపథ్యంలో దూత అనే వెబ్ సిరీస్ చేయ‌గా, ఇది ఎలా ఉంది అనేది చూద్దాం?క‌థ విష‌యానికి వ‌స్తే.. సాగర్ (నాగ చైతన్య) మొదట జర్నలిస్ట్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అనంతరం సమాచార్ పత్రికకు చీఫ్ ఎడిటర్ అవుతాడు. అయితే ఆయన జీవితంలో అనేక విషాదాలు చోటు చేసుకోవ‌డం, ఆ విషాదాలు క్లిప్పింగ్‌లుగా వార్తా ప‌త్రిక‌లు ముందుగానే అంచనా వేయడం జ‌రుగుతుంది. మరి అది ఎలా సాధ్యం, సాగర్‌కి తన ప్రొఫెషన్ లో శత్రువులు ఎవరైనా ఉన్నారా, మరి చివరిగా ఆ వార్తాపత్రికల క్లిప్పింగ్‌ల వెనుక రహస్యాన్ని సాగర్ ఛేదించగలిగాడు అనేది వెబ్ సిరీస్ చూస్తే అర్ధ‌మ‌వుతుంది.

విక్రమ్ కె కుమార్ సినిమాలు చూస్తే… ఓ చిన్న పాయింట్ తీసుకుని స్క్రీన్ ప్లేను చక్కగా అర్థం అయ్యేలా చెబుతారు. ‘దూత’ కథ ఏమిటనేది ఐదారు ఎపిసోడ్స్ తర్వాత గానీ క్లారిటీ రాదు. అసలు, అప్పటి వరకు కథ గురించి ఆలోచించే అవకాశాన్ని వీక్షకులకు విక్రమ్ కె కుమార్ ఎక్క‌డ ఇవ్వలేదు. ఏదో ఒక మేజిక్ చేస్తూ ముందుకు వెళ్లారు. మొదటి ఎపిసోడ్ మొదలైన కాసేపటికి కథలోకి వెళ్లారు. కళ్ళ ముందు కనిపించే పాత్రలతో ప్రయాణం చేసేలా ఆయన రూపొందించారు ‘దూత’లో దెయ్యం లేదు. కానీ, కంటికి కనిపించని అతీంద్రియ శక్తి ఉందని చెప్పారు. చిన్న చిన్న చమక్కులు, మెరుపులతో ఆసక్తి సన్నగిల్లకుండా చూశారు. కొన్ని సీన్లలో విక్రమ్ డీటెయిలింగ్ సామాన్య ప్రేక్షకులు సైతం గమనించేలా ఉంటుంది.

Dhootha Web Series Review know how is it
Dhootha Web Series Review

ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశాలలో ఆ నెమ్మది ఉంటుంది. ‘దూత’కు అటువంటి అలసట ఫ్లాష్ బ్యాక్ రూపంలో వచ్చింది. అది కొత్తగా లేదు. అప్పటి వరకు కొత్తగా ముందుకు వెళ్లిన కథను సగటు రివేంజ్ ఫార్ములా రూటులోకి తీసుకు వెళ్ళింది.ప్రతి క్యారెక్టర్ లో ఎంతో డెప్త్ ఉండడంతో పాటు చివరి వరకు ప్రతి క్యారెక్టర్ కథనాన్ని ఇంట్రెస్టింగ్ గా ముందుకి తీసుకుకెళుతుంది. ముఖ్యంగా నాగ చైతన్య తన తొలి వెబ్ సిరీస్ లో అద్భుతంగా నటించారు. తన క్యారెక్టర్ లో రెండు షేడ్స్ ఉన్నా, వాటిని బాగా పెర్ఫార్మ్ చేసారు. తన ఫ్యామిలీ యొక్క సేఫ్టీ ని ఎంతో జాగ్రత్తగా చూసుకునే వ్యక్తిగా ఆయన తన క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా యాక్ట్ చేశారు.సిరీస్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా లేవు. అయితే కథ పాతదే అయినప్పటికీ కూడా కథనాన్ని దర్శకుడు ఇంట్రెస్టింగ్ గా నడిపిన తీరు బాగుంది. మొత్తంగా ఈ సిరీస్ ద్వారా నాగ చైతన్య ఓటిటి ఆడియన్స్ ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నార‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now