వినోదం

Dhootha OTT : దూత వెబ్ సిరీస్‌తో దుమ్ము రేపుతున్న నాగ చైత‌న్య‌.. 240 దేశాల్లో 38 భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్..

Dhootha OTT : యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య స‌క్సెస్ కోసం క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో అక్కినేని ఫ్యామిలీ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ చైతూతో దూత అనే వెబ్ సిరీస్ చేశాడు. ఈ వెబ్ సిరిస్ తో చాలా గ్రాండ్ గా ఓటీటీ అరంగేట్రం చేశారు చై. సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరిస్లో ప్రియా భవానీ శంకర్‌, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మాత శరత్ మరార్ ఈ వెబ్ సిరిస్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. డిసెంబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ప్రసారం అవుతుండ‌గా, ఈ వెబ్ సిరీస్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుంది.

సుమారు 40 నిమిషాల నిడివితో 8 ఎపిసోడ్స్ ఉన్న దూత సిరీస్ సస్పెన్స్‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్‌ని ఏకంగా 240 దేశాల్లో 38 భాషల్లోని సబ్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా ఈ వెబ్ సిరీస్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుండ‌డం చూసి యూనిట్ చాలా ఆనందంగా ఉంది. విక్రమ్ చెప్పిన దూత ఆలోచన, కథాంశం చాలా నచ్చింది. ఈ కథకు నాగ చైతన్యే మొదటి ఎంపిక. ఆయన కూడా కథ వినగానే చేద్దామన్నారు అని అన్నారని ప్రొడ్యూసర్ శరత్ మరార్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ని జూన్, జులై లోనే పూర్తి చేసి ఫైనల్ కాపీ అమేజాన్ కి ఇచ్చాం. అయితే ఇచ్చిన తర్వాత ఎన్నో భాషల్లో డబ్, సబ్ టైటిల్స్ చేసి తర్వాత విడుదల చేస్తామని వారు మాకు ముందు చెప్పారు.

Dhootha OTT

ఆ ప్ర‌క్రియ కోసం దాదాపు ఐదు నెలలు సమయం తీసుకున్నారు. ఈ ప్రాసెస్ అంతా మాకు కొత్తగా అనిపించింది. అయితే విడుదలైన తర్వాత అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన రావ‌డం మాకు గొప్ప సంతోషాన్ని ఇస్తుంద‌ని అన్నారు శ‌ర‌త్ మ‌రార్.. లాంగ్ ఫార్మట్ స్టొరీ టెల్లింగ్ అనేది ఇండియాలో కొత్త ఫార్మాట్. కొన్ని సిరిస్ లు వచ్చినప్పటికీ ఇంకా కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లే. ఈ క్రమంలో చేసిన ప్రాజెక్ట్ కు ప్రేక్షకులు నుంచి ఇంత మంచి స్పందన రావడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ అని ఆయ‌న చెప్పుకొచ్చారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM