Dhee Show : ప్రముఖ డ్యాన్స్ షో ఢీ సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతోంది. రీసెంట్‌గా ఢీ 13 ఫినాలే జరగగా ఇందులో కావ్యశ్రీ విజేతగా నిలిచింది. అల్లు అర్జున్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకుంది. ఇక ఇప్పుడు రాబోయే సీజన్ ఢీ 14 డ్యాన్సింగ్ ఐకాన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సారి ఢీ జూనియర్స్, ఢీ లేడీస్ స్పెషల్, ఢీ జోడీ, ఢీ ఛాంపియన్స్ అనే నాలుగు టీమ్‌లతో షో ప్లాన్ చేయబడింది. రీసెంట్‌గా విడుదలైన ప్రోమోను చూస్తుంటే పలు మార్పులతో షో ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
యాంకర్‌గా ప్రదీప్.. టీమ్ లీడర్లుగా హైపర్ ఆది, ‘బిగ్‌బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ కనిపించారు. జడ్జిలుగా ప్రియమణి, గణేష్ మాస్టర్ ఉన్నారు. తొలి ఎపిసోడ్‌కు ‘లక్ష్య’ హీరో హీరోయిన్లు నాగశౌర్య, కేతిక శర్మ విచ్చేసి సందడి చేశారు. అలాగే డాన్సర్ తేజస్వినితో కలిసి హిప్ మూవ్‌మెంట్ చేసిన హైపర్ ఆది తెగ నవ్వించారు. అయితే స్మాల్ స్క్రీన్ జోడీ సుడిగాలి సుధీర్, రష్మి ఇందులో కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
దాదాపు ఐదు సీజన్లలో టీమ్ లీడర్‌లుగా కనిపించిన సుధీర్ – రష్మీ జంట ప్రోమోలో కనిపించకపోవడంతో వారి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సుధీర్ లేకపోవడంతో రష్మీ కూడా ఈ సీజన్‌లో కనిపించదని అంటున్నారు. అందుకే ఆమె స్థానంలో మోనాల్ గజ్జర్ ను రంగంలోకి దింపుతున్నారట. ఇతర టీమ్ లీడర్‌గా దీపికా పిల్లి కొనసాగవచ్చు. బిగ్ బాస్ రొమాన్స్‌ని ఇక్కడ మరోసారి బుల్లితెర ప్రేక్షకులకి చూపించేందుకు ఢీ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.