Chiranjeevi : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఎదురయ్యింది. ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు . విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు ఒక మంచి మెసేజ్ ని అందిస్తున్నారు చిరంజీవి. మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేకపోయినా చిరంజీవిపై అభిమానులకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ అక్టోబర్ 5 న విజయదశమి కానుకగా గాడ్ ఫాదర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి. ఈ సినిమా సక్సెస్ తో చిరంజీవి మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేసారు.
చిరు సినిమా వస్తుందంటే ఎంతటి పెద్ద స్టార్ అయినా సరే తమ సినిమాను వాయిదా వేసుకుంటారన్న సంగతి తెలిసిందే. అందుకు కారణం చిరుకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అలాంటిది. ఇంతటి స్టార్డమ్ ఉన్న మెగాస్టార్ ఒకానొక సంధర్బంలో తన సినిమాను ఒక యంగ్ హీరో కోసం వాయిదా వేసుకున్నారు. ఆ యంగ్ హీరో మరెవరో కాదు.. నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సరిగ్గా 10 సంవత్సరాల కిందట ఈ ఘటన జరిగింది.
ఎన్టీఆర్ ఆది సినిమాతో మాస్ హిట్ ను అందున్నాడు. ఈ సినిమా తరవాత తెలుగు ప్రేక్షకులలో ఎన్టీఆర్ క్రేజ్ బాగా పెరిగింది. ఇక ఆది సినిమా తరవాత ఎన్టీఆర్ బి.గోపాల్ దర్శకత్వంలో అల్లరి రాముడు అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ ఎన్టీఆర్ కు జోడీగా నటించింది. ఇక అదే సమయంలో బి.గోపాల్ చిరంజీవి హీరోగా ఇంద్ర సినిమాను పూర్తి చేసారు. ఇక ఈ రెండు చిత్రాలను జూలై 18న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట నిర్మాతలు.
కానీ ఒకవేళ ఇంద్ర ఫ్లాప్ అయ్యి అల్లరి రాముడు హిట్ అయితే చిరంజీవి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించి నిర్మాతలు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారట. అప్పటికే చిరంజీవి మంజునాథ, మృగరాజు, డాడీ లాంటి వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంద్ర సినిమాను ఓ వారం రోజుల పాటూ వాయిదా వేసుకుని జూలై 24వ తేదీన విడుదల చేశారు మూవీ మేకర్స్. కానీ నిర్మాతలు అనుకున్నదానికి భిన్నంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అల్లరి రాముడు చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. నిర్మాతలు ఊహించని విధంగా ఇంద్ర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…