Chiranjeevi Net Worth : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా ఏకచక్రాధిపత్యం వహిస్తున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో ఎదిగిన చిరు ఎన్నో పేరు ప్రఖ్యాతలు గడించారు. చిన్న హీరోగా మొదలు పెట్టి తెలుగు సినిమాను శాశించే స్థాయికి వెళ్ళారు చిరంజీవి. ఈ రోజు మెగా ఫ్యామిలీ నుంచి 11 మంది హీరోలు సినిమాలు చేస్తున్నారంటే ఆయన రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇన్నేళ్ళ సినిమా, రాజకీయ జీవితంలో చిరంజీవి భారీగానే ఆస్తులు సంపాదించారు. కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా ఒకప్పుడు చిరంజీవి చరిత్ర సృష్టించారు. ఘరానా మొగుడు సినిమాకు ఆయనకు కోటి రూపాయలు ఇచ్చారు.
ఇక రీఎంట్రీ లోను అదరగొడుతున్న చిరు తన సినిమాకి అలవకోగా వంద కోట్ల కలెక్షన్స్ తెప్పిస్తున్నాడు. చిరంజీవి ఇన్నేళ్ల కెరీర్‌లో బాగానే కూడబెట్టినట్టు తెలుస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్, విజయవాడ నగరాల్లో భారీగా భవనాలు, స్థిరాస్తులు ఉన్నాయి. సినిమా పరిశ్రమ హైదరాబాద్ రాకముందు చిరంజీవి కుటుంబంతో కలిసి చెన్నై లో ఉండగా. అక్కడ కూడా చిరంజీవి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. ఇక హైదరాబాద్ లో విలాసవంతమైన ఫాం హౌస్ లు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో చిరంజీవి భారీగానే పెట్టుబడులు పెట్టారు.
ప్రస్తుతం చిరంజీవి ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటున్నారని తెలుస్తుండగా, 2009 సంవత్సరంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపున పాలకొల్లు మరియు తిరుపతి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చిరంజీవి తన పేరుపై 33 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఆఫిడవిట్ లో పొందుపరిచారు. ఈ ఆస్తులలో 30 కోట్ల రూపాయల ఆస్తులు స్థిరాస్తులు అని, 3 కోట్ల రూపాయల ఆస్తులు చరాస్తులు అని సమాచారం. ఇక ఆయన భార్యపై ఆరు కోట్ల రూపాయల ఆస్తి ఉందని పేర్కొన్నారు. మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రస్తుతం చిరంజీవి ఆస్తుల విలువ రూ.1000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడే కాక తమిళనాడు రాష్ట్రంలో కూడా చిరు ఆస్తులు బాగానే కూడబెట్టాడని సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…