ఓ సినిమా చేయడం అనేది.. మనం రెండు గంటల్లో సినిమా చూసినంత ఈజీ కాదు. ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అని చాలా పనులు ఉంటాయి. ఇంకా ఆర్టిస్టుల ఎంపిక హీరో హీరోయిన్ల ఎంపిక కత్తిమీద సాములాంటిదే. కథ ఎంత బాగున్నా హీరో హీరోయిన్లు సెట్ అవ్వకపోతే అంతే సంగతులు. అందుకే ఆ విషయంలో దర్శక నిర్మాతలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఒక్కోసారి ముందు నుంచి అనుకున్న హీరోతో కాకుండా.. వేరే వారితో సినిమా చేయాల్సి రావొచ్చు. ఇలా ఇప్పటికే అనేకసార్లు జరిగింది. ఒకరు ఓకే చేసిన కథతో ఇంకొకరు మూవీ తీసి హిట్ కొట్టిన సందర్భాలు అనేకం.
ఇలాంటి సంఘటనే చిరంజీవి, వెంకటేష్ ల మధ్య కూడా జరిగింది. చిరు చేయాల్సిన ఓ సినిమాను వెంకటేష్ చేశారు. అది ఎలా అంటే.. నిర్మాతగా కేవీబీ సత్యనారాయణ విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో సుందరకాండ అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. దీనికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. అదే సమయంలో.. సత్యనారాయణ గారు రజనీకాంత్ నటించి సూపర్ హిట్ అయిన అన్నామలై సినిమాను తెలుగులో డబ్ చేయడానికి రైట్స్ తీసుకుని ఫ్లైట్ లో హైదరాబాద్ వస్తున్నారు. అప్పుడు అదే ఫ్లైట్ లో ఆయన చిరంజీవి కలిశారు. ఆయనకు ఫ్లైట్ లోనే ఓ సినిమా కథ చెప్పడంతో.. చిరుకి బాగా నచ్చి చేయడానికి ఓకే చెప్పారు.
దాంతో చిరంజీవి ఓకే చెప్పాడు అనే సంతోషంలో సుందరకాండ షూటింగ్ దగ్గరకు వచ్చిన సత్యనారాయణ.. ఆ సినిమా స్టోరీని వెంకటేష్ కు కూడా చెప్పారు. అప్పుడు వెంకటేష్ ఈ సినిమా కూడా మానమే చేద్దాం అనడంతో.. సత్యనారాయణకు ఏం చేయాలో అర్ధం కాలేదు. ఇప్పుడు ఆ కథ చిరుతో తీయాలా.. లేక వెంకీతో తీయాలా అనే అయోమయంలో పడిపోయి.. తర్వాత చిరుకి అసలు విషయం చెప్పి.. ఆ సినిమాను రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వెంకటేష్ తోనే చేసారు. కొండపల్లి రాజాగా తెరకెక్కిన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలా చిరు నుంచి వెళ్లిన కథతో వెంకీ హిట్ అందుకున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…