Chinna In OTT : బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన సిద్ధార్థ్ ఇటీవల వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్ జోనర్‌లో చిత్తా అనే సినిమా చేశాడు. తెలుగులో చిన్నా పేరుతో ఈ మూవీ విడుదలైంది. గత వారం 17నే డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్లో విడుదల అవుతుందని ప్రకటించి కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా వేశారు. తాజాగా సదరు ఓటీటీ సంస్థ మరోసారి చిన్నా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని ఎనౌన్స్ చేసింది. నవంబర్ 28 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో సినిమా స్ట్రీమింగ్ జరుగనున్నట్లు ప్రకటించింది.ఎస్‌యూ అరుణ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఓ మోస్తరు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చిన్నామూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, కన్నడ భాషల్లో సిద్ధార్థ్ మూవీ స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. ఈ సినిమాలో సిద్ధార్థ్‌తో పాటు నిమిషా విజయన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ కీలక పాత్రలు పోషించారు. చైల్డ్ అబ్యూజింగ్, హరాస్మెంట్ వంటి సున్నితమైన అంశాలను ఎంతో ఎమోషనల్‌గా చూపించారు. హీరో సిద్ధార్థ్ స్వయంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇక సిద్ధార్థ్ చిన్నా మూవీ కథ విషయానికి వస్తే.. అన్నయ్య చనిపోవడంతో వదిన, పాపను తానే చూసుకుంటుంటాడు ఈశ్వర్ (సిద్ధార్థ్). ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ వారిద్దరిని పోషిస్తుంటాడు. అయితే నగరంలో చిన్న పిల్లలు వరుసగా కిడ్నాప్‌లకు గురవుతారు.
వారిని అత్యాచారం చేసి దారుణంగా చంపుతుంటారు. ఈశ్వర్‌పై కూడా ఇలాంటి ఆరోపణలు రావడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేస్తారు. ఇదే సమయంలో ఈశ్వర్ కుమార్తె కూడా అపహరణకు గురవుతుంది. మరి హీరో తన అన్న కూతురును వెతికి పట్టుకున్నాడా? లేదా? అన్నదే చిన్నా సినిమా కథ. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యింటే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. సిద్ధార్థ్ నట జీవితంలోనే ఇది ఉత్తమ చిత్రం అంటూ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. తప్పనిసరిగా జాతీయ అవార్డు సాధించే చిత్రంగా పేర్కొన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…