Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ బాస్ షో ఒకవైపు ప్రేక్షకులని అలరిస్తున్నా, మరోవైపు దీనిపై విమర్శలు గుప్పించే వారు లేకపోలేదు. గతంలో శ్రీరెడ్డి వంటి వారు దారుణమైన కామెంట్స్ చేయగా, ఈ సారి మాధవీ లత సంచలన కామెంట్స్ చేస్తూ వస్తోంది. తన ఫేస్ బుక్ పేజ్‌లో ఏమయ్యా బిగ్ బాస్ .. ఏందయ్యా ఇది. ఆడ పిల్లను బానిసను చేసి నవ్వకూడదు.. ఏడ్వకూడదు.. వంగ కూడదు.. అంటూ ఓ ఆడపిల్లను మానసిక అత్యాచారం చేస్తున్నారు.
వీకెండ్ లో నాగ్ మావ ఊపుకుంటూ వచ్చి వగలు పోతారు. చివరికి నాగార్జునని కూడా టీఆర్పీ కోసం దిగజార్చేస్తున్నారు. ఒక కన్న తల్లి మాటకి విలువ లేకుండా చేస్తున్నారు. సభ్య సమాజానికి బిగ్ బాస్ ఏం చెప్పాలనుకుంటున్నారు ? హగ్గులు ఇచ్చేస్తున్న వాడికే కప్ తగలబెట్టడండి. అలాంటి వాడికే బిగ్ బాస్ లో ప్లేస్ ఒకటి. ఇలాంటి వాడికి కిరీటం ఇస్తే బీబీ కొంప మీద ఫైర్ యాక్సిడెంట్ అయి సెట్ తగలబడిపోవడం ఖాయం. హగ్గులు.. కిస్సులు.. పక్కోడి పెళ్లాన్ని వాటేసుకోవడం.. స్నేహం ముసుగులో కామకలాపాలు చూడలేకపోతున్నాం.
బీబీ చివరి ఎపిసోడ్ చూసి మీ నిర్ణయం సమాజానికి ఉపయోగకరమైన ఇంపాక్ట్ ఇవ్వకపోతే షోపై డైరెక్ట్ గా సుప్రీం కోర్టులో కేసు వేస్తా. హైకోర్టులో కూడా ఓ పిల్ పడేస్తాను. ఇది జోక్ కాదు. చాలా సీరియస్. టైంపాస్ కోసం టీవీ చూద్దామంటే అన్నీ అవమానాలే కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులతో కలసి చూడలేని పరిస్థితి. అడల్ట్ షో చూస్తున్నామా ? అన్న ఫీలింగ్ కలుగుతోంది. `బిగ్ బాస్ -5` వరస్ట్ షో“ అంటూ.. మండిపడింది మాధవీలత.