Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం ఆసక్తికరంగా సాగుతోంది. 19మందితో మొదలైన ఈ షోలో ప్రస్తుతం కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. అయితే ఈ రోజు ఒకరు హౌజ్ నుండి ఎలిమినేట్ కానుండగా, టాప్ 5లో ఎవరు ఉంటారనే చర్చ కొద్ది రోజులుగా నడుస్తోంది. ఈ వారం సన్నీ టాప్ ఓటింగ్‌తో దూసుకుపోగా.. తరువాతి స్థానంలో షణ్ముఖ్ నిలిచాడు.. సిరి కూడా సేఫ్ కావడంతో.. మానస్-కాజల్‌ల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఇందులో కాజల్ వెనుకబడిపోవడంతో మానస్ సేఫ్ అయ్యి కాజల్ ఎలిమినేట్ అయింది.
రెండు వారాలుగా షణ్ముఖ్‌కి బాగా నెగెటివిటీ వచ్చింది. అతడు ఈ వారం ఎలిమినేట్ అవుతాడని అందరూ ఊహించగా, ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వలన సేవ్ అయ్యాడు. ఇక కాజల్ ఎప్పటి నుండో ఎలిమినేషన్ కావలసి ఉన్నా మెల్లమెల్లగా ఇక్కడి వరకు చేరుకుంది. ఎట్టకేలకు 14వ వారం ఎలిమినేట్ అయింది. బిగ్‌బాస్ హౌజ్‌లోకి 17వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన కాజల్.. మొదటి రెండు మూడు వారాల్లోనే ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారంతా.. కానీ.. అదృష్టం, ఆటతో ఇక్కడి వరకు వచ్చింది.
ఇప్పటికే సింగర్ శ్రీరామ్ ఫినాలేకి చేరుకోగా, తాజాగా సన్నీ కూడా ఫినాలేకి చేరుకున్నట్టు ప్రకటించాడు నాగ్. ఇక ఈ రోజు కాజల్ ఎలిమినేట్ కావడంతో మానస్, షణ్ముఖ్, సిరిలు కూడా ఫినాలే రేసులో ఉన్నారు. అయితే ఈ ఐదుగురిలో ఎవరెవరికి ఏఏ స్థానాలు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 19న ఫినాలే జరగనుండగా, ఈ కార్యక్రమానికి గెస్ట్ గా చిరునే వస్తారని ప్రచారం నడుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…