Bigg Boss 5 : బిగ్ బాస్ ఎండింగ్‌కి చేరుకున్న క్రమంలో శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో హౌస్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్ హౌస్ జర్నీపై ఆడియన్స్ పలు ప్రశ్నలు సంధించారు.. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నకు ముక్కు సూటిగా దాపరికం లేకుండా ఆన్సర్ ఇవ్వాలని కోరారు బిగ్ బాస్. ఈ ప్రశ్నలు పూర్తైన తరువాత.. ఎవరైతే ప్రేక్షకుల ప్రశ్నకు సరైన సమాధానం ముసుగులేకుండా ఇస్తారో.. వాళ్లని ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఎంచుకుంటారో వాళ్లు ప్రేక్షకుల్ని ఓటు అపీల్ చేసుకోవచ్చని చెప్పారు బిగ్ బాస్.
మొదటిగా సిరికి వచ్చిన ప్రశ్న ఏంటంటే..
మీరు షణ్ముఖ్ కంటే స్ట్రాంగ్ ప్లేయర్.. కానీ మిమ్మల్ని మీరు ఎందుకు అలా కన్సిడర్ చేసుకోవడం లేదు?
సిరి సమాధానం : నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు.. నేను స్ట్రాంగ్ ప్లేయర్ అని నమ్ముతాను. నేను హౌస్‌లో కొన్ని పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పుడు నాకు షణ్ముఖ్ తోడుగా ఉన్నాడు.. నేను చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను.. వాడ్ని నేను అక్కడ చూడాలని అనుకుంటున్నా.. మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే సారీ..
రెడో ప్రశ్న కాజల్‌ని ఏమి అడిగారంటే, ఆనీ మాస్టర్‌తో రెస్పెక్ట్ గురించి మాట్లాడినప్పుడు తుడిచిన టిష్యూని సన్నీపై కొట్టడం రెస్పెక్టా..!
కాజల్ సమాధానం : ఆనీ మాస్టర్‌తో జరిగింది గొడవలో.. సన్నీతో కూడా గొడవలోనే కానీ.. అది కూల్ డౌన్‌లో చేసే ప్రాసెస్‌లో అలా చేశా.. అతనికి నాకు ఆ చనువు ఉంది అందుకే వేశాను. సన్నీ అంటే నాకు చాలా రెస్పెక్ట్.
ఇక మూడో ప్రశ్న సన్నీకి.. గిల్టీ బోర్డ్ వేసుకుని తిరిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ? ఆ ఇన్సిడెంట్ తరువాత మీ కాన్ఫిడెన్స్‌ని ఎలా తిరిగిపొందారు ?
సన్నీ సమాధానం : గిల్టీ బోర్డ్ అనేది ఈ సీజన్‌లో నన్ను బాగా బాధ పెట్టింది. కెప్టెన్సీ టాస్క్‌లో హౌస్ మేట్స్‌కి నాపై కోపం కలిగింది. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. దాని తరువాత కాన్ఫిడెన్స్ పెరిగింది.. దాన్ని కంటిన్యూ చేస్తున్నా. బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నా.
నాలుగో ప్రశ్న శ్రీరామ్‌కి .. జెస్సీతో ఇష్యూ జరిగినప్పుడు షన్నూ ఇన్ మెచ్యూర్డ్ అని అన్నారు.. కానీ ర్యాంకింగ్‌లో మీరే షన్నూ మెచ్యూర్డ్ అని తనకి రెండో స్థానం ఇచ్చారు.. మీ ఒపీనియన్ ఎందుకు మారింది ? ఇప్పుడు మీరు షన్నూ గ్రూప్‌లో ఉన్నారా ?
శ్రీరామ్ సమాధానం : నేను ఏ గ్రూప్‌లోనూ లేను. ఫస్ట్‌లో షన్నూతో నాకు పెద్ద పరిచయం లేదు. ఇప్పుడు నాకు తెలిసిన షణ్ముఖ్ వేరే.. తను ఏంటో తెలిసింది. అందుకే నా ఒపీనియన్ మార్చుకున్నా.
ఐదో ప్రశ్న మానస్‌కి.. ఆడియన్స్ దగ్గర మంచి మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్‌లా వాడుకుంటున్నాడని మీకు అనిపించట్లేదా?
మానస్ సమాధానం : ఫ్రెండ్‌లా వాడుకుంటున్నాడు అనేది రాంగ్.. మా బాండ్ పెరుగుతూనే ఉన్నది.. జన్యున్‌గా నేను కనెక్ట్ అయ్యా.. ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేస్తాడు.. ఒకర్ని వాడుకుని పైకి ఎదగాలనే మనస్తత్వం సన్నీది కాదు.. నేను సన్నీతో ట్రావెల్ అవుతున్నా కాబట్టి వాడేంటో నాకు తెలుసు.. మీకు అనిపిస్తే మీరు మార్చుకోండి అని చెప్పాడు.
ఆరో ప్రశ్న.. షణ్ముఖ్ కి.. సిరి అంటే మీరు ఎందుకంత పొసెసివ్‌గా ఫీల్ అవుతారు? మీరు సిరిని ప్రతిసారి ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు ? తనని తనలా ఎందుకు ఉండనివ్వరు ?
షణ్ముఖ్ సమాధానం : ఇది నేను ఎక్స్ పెక్ట్ చేశా.. పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నానని నాకు తెలుసు. కొన్ని కొన్ని విషయాల్లో కంట్రోల్ చేస్తేనే బెటర్ అని అనిపించింది. మరికొన్ని విషయాల్లో తనని తనలా ఉండనివ్వాలనేది నా పాయింట్. ఈ రెండింటి మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోయా.. తనపై గేమ్ ఎవరైతే ఆడాలని అనుకుంటారో వాళ్లని తప్పకుండా కంట్రోల్ చేస్తా.. ఎందుకంటే సిరిని నేను టాప్ 5లో చూడాలని అనుకుంటున్నా’ అని సమాధానం ఇచ్చాడు.
ఏడో ప్రశ్న కాజల్ గురించి.. సన్నీ, మానస్‌ల గురించి కాగా, అందులో అందరి ముందు కాజల్‌ని ఎందుకు కించపరుస్తారు ? స్టాండ్ తీసుకొని మీకోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ తను విన్ అయ్యింది.
సన్నీ సమాధానం : ఎవిక్షన్ ఫ్రీ పాస్ తరువాత మేం కాజల్‌ని సరదాగే అన్నాం.. బాధని వ్యక్తపరిచాం అంతే.. మీకు అలా అనిపించింది కాబట్టి ఇంకా ఎక్కువచేస్తాం అని పంచ్ వేశాడు సన్నీ.
ఎనిమిదో ప్రశ్న.. సిరి, షణ్ముఖ్.. మీరు రవిని నామినేట్ చేశారు.. ఇంకా ఆయనికి ఇన్‌ఫ్లుయెన్సర్ అనే పేరు కూడా ఇచ్చారు.. మరి టికెట్ టు ఫినాలే టాస్క్‌లో మేం నీకోసం ఆడుతున్నాం రవీ.. నిన్ను మిస్ అవుతున్నాం రవి అని అనడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా ?
సిరి, షణ్ముఖ్ సమాధానం : మనిషి ఉన్నప్పుడు వాల్యూ తెలియదు.. లేనప్పుడే తెలుస్తుందని అంటారు కదా.. అదే నిజమైంది. రవి ఎలిమినేట్ అవుతాడని అనుకోలేదు. ఆ గేమ్ ఆడుతున్నప్పుడు రవి గుర్తొచ్చాడు.. ఎందుకు గుర్తొచ్చాడో తెలియదు. నేను చాలా మిస్ అయ్యాను.. అందుకే మిస్ అయ్యాను అని చెప్పా.. అని చెప్పింది సిరి.
తొమ్మిదో ప్రశ్న.. ఇవి ఎలా నచ్చుతున్నాయి.. అవి ఎలా నచ్చుతున్నాయి అని ఆడియన్స్‌ని జడ్జ్ ఎందుకు చేస్తున్నారు ? వారిపై ఫన్ ఎందుకు చేస్తున్నారు ?
షణ్ముఖ్ సమాధానం : ఆడియన్స్ జడ్జ్ చేయడం లేదు.. నా పాయింట్ నేను చెప్తున్నా.. అది బయటవాళ్లకి నచ్చుతుందా లేదా ? అని ఆలోచిస్తున్నా.. అది తప్పా, కరెక్టో అర్ధం కావడం లేదు. నేను ఆడియన్స్‌ని ఫన్ చేయడం లేదు.. మళ్లీ అది రిపీట్ చేయను.
పదో ప్రశ్న శ్రీరామ్‌కి .. బిగినింగ్ నుంచి గ్రూప్‌లోనే ఆడుతూ వచ్చారు. కానీ మిమ్మల్ని మీరు.. లోన్ రేంజర్‌లా ప్రొక్లెన్ చేసుకున్నారు.. ఇది సింపథీ గేమ్ ప్లాన్ కాదా ? ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో మీరు, రవి.. ఇద్దరి ఫొటోలను కాల్చేయాలని ప్లాన్ వేశారు.. కానీ కాజల్ అదే పని చేస్తే.. మీకు ఎందుకు కోపం వచ్చింది ?
శ్రీరామ్ సమాధానం : నేను సింపథీ కోసం ఆడట్లేదు.. అలాంటివి నాకు తెలియదు.. కలిసి ఆడదాం అనే ఉంటుంది.. ఫైర్ స్టేషన్ గేమ్‌లో నేను ఓవర్‌గా రియాక్ట్ అయ్యానని నాకూ అనిపించింది.. తరువాత కాజల్‌తో చెప్పా.. రెండు ఫొటోలు కాలిపోవడం అనేది నాకు నచ్చలేదు.. రవి, నేను ప్లాన్ చేయలేదు.. అని చెప్పాడు శ్రీరామ్.
మొత్తానికి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాలా ఆసక్తికరంగా సాగాయి. ఆడియన్స్ ఏదైతే అనుకుంటున్నారో వాటినే ప్రశ్నలుగా సంధించారు. ఫైనల్‌గా ఈ ప్రశ్నల పరంపర ముగిసిన తరువాత.. ఇంటి సభ్యులంతా చర్చించుకుని సన్నీ, సిరిల పేర్లు చెప్పారు. సిరి సన్నీకోసం త్యాగం చేసి.. సర్లే నువ్ వెళ్లు అని అనడంతో సన్నీ.. ఆడియన్స్‌ని ఓట్లు అభ్యర్ధించాడు.