Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ బాస్ షోపై ప్రశంసలతోపాటు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ షో గురించి శ్రీ రెడ్డి, మాధవీలత వంటి వారు విమర్శలు ఎక్కుపెట్టగా, రీసెంట్‌గా యాంకర్ రవి తల్లి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కావాలని పిలిచి తీసుకెళ్లారు. కానీ ఆ హోదా ఇవ్వలేదు. మీరు ఇచ్చేది ఏంటి.. వీళ్లు ఇస్తున్నారు చాలు. అది రెస్పెక్ట్ అంటే.. అంటూ అక్కడే ఉన్న ఫ్యాన్స్‌ను చూపించింది. ప్రస్తుతం రవి తల్లికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
రవి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన అనంతరం అతడి ఫ్యాన్స్ డ్యాన్స్ డీజేతో గ్రాండ్‌గా వెల్‌కం చెప్పారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన మీడియాతో రవి తల్లి ఉమా రాణి నా కొడుకు ప్రెషర్ కుక్కర్ నుంచి బయట పడినట్టు ఉందని చెప్పింది. అంతేగాక రవిని వాళ్లు ఎన్‌కౌంటర్ చేసినట్టు అనిపిస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నా కొడుకు టాప్ 5లో ఉండాల్సిన వాడు ఇలా ఎలిమినేట్ అవడం ఆశ్చర్యంగా ఉంది. అతడు గేమ్ ఆడాడు. పిచ్చి చేష్టలు చేసి రాలేదు. ఊరికే కూర్చోని తినలేదు. రవి గేమర్. తెలివిగా ఆడాడు.. అని చెప్పుకొచ్చింది.
‘సెలబ్రెటీలను పట్టుకు తీసుకెళ్లి మేకల్లా, గొర్రెల్లా ఉంచారు. అదే ఇండస్ట్రీలో ఉంటూ సేమ్ ఇండస్ట్రీ వారిని అవమానిస్తున్నారు. రవి అనే కాదు ప్రతి కంటెస్టెంట్‌కు ఇది ఫెయిర్ కాదు. ఇది ఎప్పటికీ సరైనది కాదు. ఇప్పటికైనా కాన్సెప్ట్ మార్చండి. లేకపోతే బిగ్‌బాస్ ఎవరూ చూడరు.. అంటూ రవి తల్లి ఉమరాణి బిగ్‌బాస్‌పై మండిపడింది. ఈ వీడియోపై పలువురు పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. కాగా, రవి తల్లి బిగ్ బాస్ వేదికగా తన కుమారుడిపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…