Bhimla Nayak : ఆర్ఆర్ఆర్ దెబ్బకు సంక్రాంతికి రావలసిన సర్కారు వారి పాట చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. భీమ్లా నాయక్ కూడా వాయిదా పడనుందంటూ కొన్నాళ్లుగా తెగ ప్రచారాలు నడుస్తూ వస్తున్నాయి. ఇక ఇప్పుడు మళ్ళీ భీమ్లా నాయక్ పై అదే పనిగా పలు రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం మొదలయ్యింది. వచ్చే జనవరి సంక్రాంతి రేస్ లో ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ అవ్వడం లేదని ఓ టాక్ పెద్ద ఎత్తున వైరల్ అయింది.

ఈ క్రమంలోనే చిత్ర నిర్మాత నాగవంశీ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘‘భీమ్లా నాయక్’.. 2022 జనవరి 12న మీ ముందుకొస్తుంది’ అని తెలిపారు. లాలా భీమ్లా రషెస్ అదిరిపోయాయని కూడా అన్నారు. భీమ్లా బ్లాస్ట్ జనవరి 12నే చూస్తాం అని క్లారిటీ ఇచ్చారు. మళయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి రీమేక్‌గా ‘భీమ్లా నాయక్’ రూపొందుతోంది.
ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలు. దర్శకుడు త్రివిక్రమ్ మాటలు రాస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సాగర్ కె చంద్ర చిత్రానికి దర్శకత్వం వహించారు. భీమ్లా నాయక్ చిత్రం మరి కొద్ది రోజులలో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. ఆ తర్వాత కమిట్ అయిన మిగతా సినిమాల షూటింగ్ పూర్తి చేయనున్నారు జనసేనాని.