Apurva Review : సర్వైవల్ థ్రిల్లర్ చిత్రాలకి ఇటీవల ప్రేక్షకాదరణ ఎక్కువగా లభిస్తుండడం మనం చూస్తున్నాం. ఇటీవల బాలీవుడ్ హాట్ బ్యూటి తారా సుతారియా, రానా నాయుడు వెబ్ సిరీస్ ఫేమ్ అభిషేక్ బెనర్జీ, రాజ్‌పాల్ యాదవ్, ధైర్య కర్వా ప్రధాన పాత్రల్లో అపూర్వ అనే చిత్రం తెరకెక్కగా, ఈ చిత్రానికి నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుంది. ఒక సాధారణమైన యువతి తనకి ఎదురైన అనూహ్యమైన పరిస్థితులను ఎలా ఎదుర్కొంది? అసాధారణమైన పరిణామాలను ఎలా తట్టుకుని నిలబడగలిగింది? అనేది ఈ కథలోని ప్రధానమైన అంశం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్ర సాగింది.
అపూర్వ చిత్ర కథ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్‌లో గ్వాలియర్‌కు చెందిన అపూర్వ (తారా సుతారియా) తల్లిదండ్రులు చూసిన అబ్బాయి సిద్ధార్థ్ (ధైర్య కర్వా)తో నిశ్చితార్థం జరుపుకుంటుంది. అయితే తన బర్త్ డేకు సర్‌ప్రైజ్ చేద్దామని ఆగ్రాకు బస్సులో వెళ్తుండగా, ఆ బస్సుపై దాడి జరుగుతుంది. సుఫారి తీసుకొని మనుషులని చంపే సుఖ్కా (అభిషేక్ బెనర్జీ), జుగ్ను (రాజ్‌పాల్ యాదవ్) గ్యాంగ్ ఆ బస్సుపై దాడి చేస్తారు. డ్రైవర్‌ని చంపి ప్రయాణికుల నుంచి రాబరీ చేస్తారు. ఆ సమయంలో అపూర్వని కూడా కిడ్నాప్ చేస్తారు. అసలు అపూర్వని కిడ్నాప్ చేయడానికి కారణం ఏంటి, అపూర్వను రక్షించేందుకు కాబోయే భర్త సిద్ధార్థ్ ఏం చేశాడు? క్రిమినల్స్ చెర నుంచి అపూర్వ బయటపడిందా లేదా అనేది చిత్రం చూస్తే తెలుస్తుంది.

ఇండియాలోని అత్యంత ప్రమాదకరమైన లొకేషన్స్ లో ఈ సిరీస్ ను చిత్రీకరించినట్టుగా మేకర్స్ చెప్పుకొచ్చారు.ఇదంతా బాగానే ఉన్నా చిత్రంలో మైనస్ ఏంటంటే. ఒక్క పాటలో అపూర్వ ఆగ్రా వెళ్లడానికి కారణం చూపించారు, అలానే క్రిమినల్స్ నుంచి తప్పించుకునేందుకు అపూర్వ ప్రయత్నాలు, క్రిమినల్స్‌ని చంపే విధానం గ్రిప్పింగ్‌గా చూపించడం కాస్త మైనస్ అని చెప్పాలి. ఎప్పుడు గ్లామర్ పాత్రలు చేసే తారా సుతారియా ఛాలేంజింగ్ రోల్ తీసుకొని ఒదిగిపోయింది. ఇందులో ఒకే ఒక్క చిన్న ట్విస్ట్ తప్ప పెద్దగా ఆశించే అంశాలు ఏమి లేనట్టుగా ఉన్నాయి. వీకెండ్‌కి ఈ మూవీ బెస్ట్ మూవీ అని చెప్పాలి.