Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్ధస్త్ షోకి యాంకరింగ్‌తో అందరి మనస్సులు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నటిగా కూడా మారింది. రంగస్థలం చిత్రంలో రంగమత్తగా అనసూయ నట విశ్వరూపం ప్రతి ఒక్కరి మనసులు గెలుచుకుంది. అనసూయ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో అనసూయ ఇచ్చే ఫోజులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ అమ్మడిపై ఎంత ట్రోలింగ్ చేసిన కూడా కేక పెట్టించే అందాలతో కుర్రకారుని తెగ అలరిస్తూ ఉంటుంది. అనసూయ అందాలని కొందరు ఆస్వాదిస్తుండగా, మరి కొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తుంటారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ.. ఓటమి తర్వాత కేటీఆర్ చేసిన ట్వీట్‌కి స్పందించింది. ఎంతోమందికి రోల్ మోడల్‌గా నిలిచిన మీరు నిజమైన లీడర్ సార్. అయితే ఈ సారి మీకు ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను కూడా అదే విధంగా బాధ్యతగా మీరు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ప్రతి క్షణం అభివృద్ధి చేస్తూ హైదరాబాద్‌తో మళ్లీ మళ్లీ ప్రేమలో పడే విధంగా చేసిన మీకు పెద్ద థాంక్యూ అని రాసుకొచ్చింది. దీనిపై థాంక్యూ ఆంటీ, చెప్పింది చాలులే కానీ, అభివృద్ధి అంటే హైదరాబాద్ ఒక్కటి చేస్తే చాలదు ఆంటీ, పెయిడ్ ఆర్టిస్ట్, అసలు నువ్వు ఓటేశావా అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
మరోవైపు కొద్ది రోజుల క్రితం విజయ్ దేవరకొండపై ఇన్‌డైరెక్ట్ గా హాట్ హాట్ కామెంట్స్ చేసి సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారింది. అర్జున్ రెడ్డి చిత్రంలో డైలాగ్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనసూయ వివాదం సృష్టించింది. చాలా కాలం పాటు అనసూయ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య వివాదం,మాటల యుద్ధం కొనసాగడం చూశాం. అయితే రీసెంట్‌గా వచ్చిన యానిమల్ చిత్రంలో చాలా అసభ్యకరమైన సన్నివేశాలు, బూతు డైలాగులు ఉండగా, దీనిపై అనసూయ ఎందుకు స్పందించడం లేదంటూ కొందరు ఆమెని ట్రోల్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ సినిమా అయితేనే మాట్లాడతావా, ఇతరుల సినిమాలపై మాట్లాడవా అంటూ అనసూయని వివాదంలోకి లాగి ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్‌పై అనసూయ స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…