Anasuya : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్ట్ అంచనాలను నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించడం మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యాన్ని సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకి సిద్ధమైంది. అయితే పదేళ్లపాటు అధికారంలో ఉన్నబీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఓటమి చెందడంతో కార్యకర్తలు, పలువురు నాయకులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఓటమి తర్వాత కేటీఆర్ తమకు రెండుసార్లు అవకాశమిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ, కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు చెప్పారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్‌పై బుల్లితెర యాంకర్ అనుసూయ స్పందించారు.
‘మీరు నిజమైన నాయకుడు సర్… ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. మన రాష్ట్ర స్థితిని అవతలి వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉండవచ్చు. బలమైన ప్రతిపక్షంగా మీరు కూడా చేయాల్సింది ఉంటుంది. ప్రతిపక్ష నేతగా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తున్నాను. హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్ది ఈ నగరంతో ప్రేమలో పడేలా చేసినందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. అయితే అనసూయ ట్వీట్‌పై కొందరు నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. థాంక్యూ ఆంటీ, చెప్పింది చాలులే కానీ, అభివృద్ధి అంటే హైదరాబాద్ ఒక్కటి చేస్తే చాలదు ఆంటీ, పెయిడ్ ఆర్టిస్ట్, అసలు నువ్వు ఓటేశావా అంటూ నెటిజన్లు ఆమెపై తెగ ఫైర్ అవుతున్నారు.
ఈ సారి ఎన్నికలలో చాలా మంది సెలబ్రిటీలు ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొన్నారు. అనసూయ కూడా ఓటు వేసి అందుకు సంబంధించిన ఫొటో షేర్ చేసింది. మరోవైపు టీవీ యాంకర్లు, బిగ్‌బాస్ సెలబ్రెటీలు, బిత్తిరి సత్తి సహా చాలా మంది ఈ సారి బీఆర్‌ఎస్ పార్టీకి ప్రచారం కూడా చేశారు. సోషల్ మీడియాలో రోజుకో వీడియో చేసి గట్టిగానే ప్రమోషన్ చేశారు. కానీ ఎవరు ఎన్ని చేసినా ఈసారి మాత్రం తెలంగాణ ప్రజలు మాత్రం మార్పు వైపే ఫోకస్ పెట్టారు . రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ని కాదని కాంగ్రెస్‌ని గెలిపించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…