Akhil : అక్కినేని వారసుడు అఖిల్ లేటెస్ట్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. పూజా హెగ్దే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు. అమ్మకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నాన్న అమెరికాలో టెస్టులు చేయించారట.
అలా టెస్టులు చేశాక.. అక్కడి డాక్టర్లు కడుపులో ఉన్నది అమ్మాయని అన్నారట. ఆ మాట వినగానే నాన్న చాలా హ్యాపీగా ఫీలయ్యారని అఖిల్ అన్నారు. ఫస్ట్ నుండి నాన్నకి ఆడపిల్లలంటే ఇష్టం. అందుకే అమ్మాయే పుట్టాలని అనుకున్నారు. వెంటనే అమ్మాయికి సంబంధించిన డ్రెస్ లు కొనేశారట. అమ్మాయికి నికిత అనే పేరుని కూడా నాగ్ డిసైడ్ చేశారట. ఆఖరికి ఇండియాకి టికెట్స్ బుక్ చేసినప్పుడు నికిత అనే పేరుని ఎంటర్ చేశారట.
కానీ డెలివరీ అయ్యాక పుట్టింది అబ్బాయి అని తెలిసి.. నాగార్జున షాక్ అయ్యారని అఖిల్ తన మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ని షేర్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికి గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటారట. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా తర్వాత అఖిల్ ఏజెంట్ సినిమాలో వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం లుక్ పరంగా.. బాడీని బిల్డ్ చేయడానికి చాలా కష్టం అని అన్నారు. దాదాపు ఏడాదిన్నరగా వర్క్ చేశానని అన్నారు. ఈ లుక్ ఆడియన్స్ కి కచ్చితంగా నచ్చుతుందని అన్నారు. అలాగే సురేందర్ రెడ్డి టేకింగ్ కూడా అద్భుతంగా వస్తుందని అఖిల్ అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…