ఒకప్పటి టాలీవుడ్ లవర్ బోయ్ సిద్ధార్థ్ మరియు అందాల భామ అదితి రావ్ కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారని సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆ మధ్య పలు చోట్ల జంటగా కనిపించిన వీరు శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి జంటగానే వచ్చారు. దీంతో ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారంపై మళ్లీ రూమర్స్ ఊపందుకున్నాయి. వీరు ఒకే టైప్ షర్ట్ లు వేసుకొని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టి అందరికీ మరికొంత క్లారిటీ ఇస్తూ వచ్చారు. అయితే 2009 సంవత్సరంలోనే బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాని ప్రేమించి పెళ్లి చేసుకుంది అదితిరావు హైదరీ. అయితే ఈ పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటే అయింది. 2013లో వీరు విడిపోయారు. అప్పటినుంచి ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తూ వస్తున్నారు.
ఇక సిద్ధార్థ్ సైతం 2003లో మేఘన అనే అమ్మాయిని వివాహం చేసుకోగా, 2007లో విడాకులు ఇచ్చేసారు. ఆ తర్వాత కొన్నాళ్ళు సింగిల్ గా ఉన్న సిద్దార్థ్.. మహాసముద్రం సినిమాతో అదితి మాయలో పడ్డట్టు టాక్. వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే ‘ఇద్దరం రిలేషన్ లో ఉన్న మాట నిజమే గానీ పెళ్లి మా ఇద్దరికీ కలిసి రాలేదు’ అని వారిద్దరు సన్నిహితుల దగ్గర వెల్లడించినట్లు సమాచారం. దీంతో వారిద్దరు పెళ్లి చేసుకుంటారా? లేకుంటే ఇలానే ఉంటూ కాలం వెళ్లదీస్తారా అనేది తెలియాల్సి ఉంది.
రీసెంట్ గానే అదితిరావు హైదరీ మాజీ భర్త సత్యదీప్ మిశ్రా రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. వివియన్ రిచర్డ్స్ కుమార్తె మసాబా గుప్తాను వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు సిద్దార్థ్ తో అదితి రిలేషన్ అనే టాపిక్ నడుస్తున్న వేళ ఆమెపై షాకింగ్ కామెంట్స్ చేశారు సత్యదీప్. అదితితో నా రిలేషన్ కారణంగా.. నాకు ప్రేమ మీదే విరక్తి కలిగింది. మరోసారి ప్రేమలో పడటం అంటేనే భయం వేసింది. బ్రేకప్ అనుభవం ఎదురైన వాళ్లు.. మళ్లీ రిలేషన్, ప్రేమ అంటేఎంతో భయపడతారు.. కానీ ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనం కోల్పోయినవి పొందగలం అని అదితి మాజీ భర్త సత్యదీప్ చెప్పుకొచ్చారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…