Actor Nikhil : టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. ఆయన కెరీర్‌లో సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న సమయంలో పల్లవి అనే డాక్టర్‌ని వివాహం చేసుకున్నారు. 2020లో కోవిడ్ మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో వీరు కరోనా నిబంధనలను పాటిస్తూ పెళ్లి చేసుకున్నారు. మరోవైపు వీరిద్దరూ విడిపోతున్నారనే ప్రచారం కూడా గతంలో జరిగింది. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని ఇద్దరూ ఖండించారు. అయితే ఇదిలా తప్పుడు ప్రచారం జరుగుతున్న సమయంలో నిఖిల్‌కి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
నిఖిల్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. నిఖిల్ భార్య గర్భవతి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న నిఖిల్ భార్య డాక్టర్ పల్లవి బేబీ బంప్‌తో కనిపించిన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పల్లవి గర్భవతి అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై నిఖిల్ మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
పెళ్ళై నాలుగేళ్లు అవుతుండగా నిఖిల్-పల్లవి స్వీట్ న్యూస్ చెప్పనున్నారని తెగ ప్రచారాలు జరుగుతుంది.ఇటీవల నిఖిల్, పల్లవి ఇద్దరూ జంటగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వారిపై వచ్చే తప్పుడు వార్తలని ఖండించారు. నిఖిల్ హ్యాపీ డేస్ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు. స్వామి రారా, కార్తికేయ, ఎక్కడికిపోతావు చిన్నవాడా చిత్రాలు ఫేమ్ తెచ్చాయి. కార్తికేయ 2 ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. నిఖిల్ గత చిత్రం స్పై నిరాశపరిచింది… హీరో నిఖిల్ స్వయంభు చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇది పీరియాడిక్ యాక్షన్ డ్రామా. స్వయంభులో ఆయన లాంగ్ హెయిర్ తో కనిపించనున్నారు. కత్తి సాము వంటి యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్నాడు. పాన్ ఇండియా మూవీగా స్వయంభు భారీగా విడుదల కానుంది. స్వయంభు నిఖిల్ 20వ చిత్రంగా విడుదల అవుతుంది. చిత్రంలో నిఖిల్ కి జంటగా సంయుక్త మీనన్ నటించనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…