Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ వయస్సులోను ఎంతో ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న తలైవా 170 టీజర్ విడుదలైంది. ఈ చిత్రానికి జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్ తెరకెక్కిస్తున్నారు. వెట్టైయాన్ టైటిల్‌ను ఫైనల్ చేశారు. బుక్ రీడింగ్ తర్వాత చేతిలో స్టిక్ పట్టుకొని.. స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న రజినీకాంత్ విజువల్స్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
డిసెంబర్ 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. రజనీకాంత్‌కు భారతదేశంలోనే కాకుండా జపాన్, మలేషియా, దక్షిణ కొరియా, అమెరికా, యూకే, దుబాయ్ తదితర దేశాల్లో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. జైలర్ మెగా హిట్ అయిన తర్వాత రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు కూడా చాలా జోరుగా జరిగాయి. తమిళనాడులో చిన్నా పెద్ద అని తేడా లేకుండా రజనీకాంత్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. రజనీకాంత్ సినిమాలతోనే కాకుండా సేవా కార్యక్రమాలతోను ఎంతో మంది మనసులు గెలుచుకున్నారు.
తమిళనాట వరదలు కావడంతో.. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పలువురు సోషల్ మీడియా వేదికగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం రజినీకాంత్ కోసం కట్టిన గుళ్లో ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి స్పెషల్ పూజలు నిర్వహించారు. మధురైకి చెందిన కార్తీక్ అనే రజనీకాంత్ వీరాభిమాని ఆయన కోసం గుడి కట్టాడు. ఆ గుడిలో 250 కిలోల రజనీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి విగ్రహం క్రింద తన తల్లిదండ్రుల ఫోటో, గణేశుని ఫోటో ఉంచాడు. ఇక ప్రతి రోజు రజనీకాంత్ విగ్రహానికి హారతులు, అభిషేకాలు పూజలు నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.. రజనీకాంత్‌ను దేవుడిగా.. తానో భక్తుడిగా మారిపోయి ప్రత్యేక పూజలు చేస్తుండడం చర్చనీయాంశం అయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…