Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకే టైమ్ లో నాలుగు సినిమాల్లో నటించి రికార్డ్ క్రియేట్ చేశారు. మరీ ముఖ్యంగా ఒకే నెలలో నాలుగు సినిమాలకు షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలతో చిరంజీవి అత్యంత అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈయన నటించిన ఆచార్య సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. మోహన్ రాజా డైరెక్షన్ లో గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు.
మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో 154వ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ని కూడా స్టార్ట్ చేశారు. ఇక ఈ నాలుగు సినిమాలు డిసెంబర్ నెలలో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇది సినీ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డ్ గా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.
తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వేదాళం సినిమాను తెలుగులో భోళా శంకర్ గా రీమేక్ చేస్తున్నారు. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా అన్నాచెల్లెళ్ళ రిలేషన్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అజిత్ క్యారెక్టర్ లో చిరంజీవి నటిస్తున్నారు. అలాగే చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు.
అలాగే మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అలాగే పవర్ ఫుల్ లేడీ పాత్రలో నయనతార నటిస్తుంది. ఇక ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుంది.
వచ్చే ఏడాదిలో ఈ సినిమాలో భారీ స్థాయిలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటుగా రామ్ చరణ్ కూడా సిద్ధ పాత్రలో పూర్తి స్థాయి సినిమాలో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ బాబీతో తెరకెక్కించే సినిమా కూడా చిరంజీవి రేంజ్ ని పెంచేలా ఉందని టాలీవుడ్ సినీ వర్గాలలలో టాక్ నడుస్తోంది.