యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు శుభవార్తను తెలియజేస్తూ తాజాగా మరొక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ 2022 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి 247 పోస్టులను భర్తీ చేయనుంది.
సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 12వ తేదీ ఆఖరి తేదీ.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2022 జనవరి 1వ తేదీ నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 22న ప్రారంభం కాగా అక్టోబర్ 12వ తేదీ ఆఖరి తేదీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఏ విధమైనటువంటి పరీక్ష అవసరం లేదు. ఇతరులు ₹200 పరీక్ష రుసుం చెల్లించాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను https://www.upsc.gov.in/ అనే వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు.