ఏపీ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య శాఖలో ఖాళీగా ఉన్న వివిధ రకాల పోస్టులను భర్తీ చేయడానికి ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే ప్రాథమిక ఆస్పత్రుల నుంచి బోధన ఆసుపత్రుల వరకు ఖాళీగా ఉన్న 14,200 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది.
అక్టోబర్ 15 నుంచి నవంబర్ నెలలోగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్యంపై సమీక్షించిన ముఖ్యమంత్రి ఆస్పత్రిలలో కూడా సిబ్బంది కొరత ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే పాథమిక ఆస్పత్రుల నుంచి మొదలుకొని ఇతర ఆసుపత్రులలో కూడా సిబ్బంది కొరత ఉండకూడదని ఖాళీలను భర్తీ చేయనున్నారు.
కోవిడ్ 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్ పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపిన అనంతరం ముఖ్యమంత్రి ఈ విధమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఈ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రానుందని, ఇందుకు అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని సూచించారు.