తెలంగాణ గ్రామాలలోని పేదలకు మరిన్ని వైద్య సేవలను అందించడం కోసం తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే గ్రామాల్లో ఉన్న ఆస్పత్రులలో పని చేయడం కోసం వైద్యుల పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ సర్కారు ఆదేశాలను జారీ చేసింది. ఈ క్రమంలోనే 1,677 పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేస్తూ అక్టోబర్ నెల చివరినాటికి వైద్యుల నియామకాలు పూర్తి కావాలని ఆదేశించింది. ఈ ఉద్యోగాల నియామకాలకు జిల్లా సెలక్షన్ కమిటీ నేతృత్వంలో నియామక ప్రక్రియ జరుగనుంది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు.
ఇందులో డీఎంహెచ్‌ఎం, సోషల్ వెల్ఫేర్ డీడీ, టీవీవీపీ అధికారులు సభ్యులుగా ఉంటారు.
ఈ వైద్య ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 28న విడుదలయ్యి అక్టోబర్ 12వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. అనంతరం దరఖాస్తులను పరిశీలించి అక్టోబర్ 26న మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. 27వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించి ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నారు.