ఇన్సిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ బ్యాంకుల ఖాళీగా ఉన్నటువంటి 5830 క్లర్క్ పోస్టుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత అయిన వారు అర్హులుగా ప్రకటించింది. మొత్తం 5830 పోస్టులలో తెలంగాణలో263 ఖాళీలు ఉండగా, ఆంధ్రప్రదేశ్లో 263 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పై తెలిపిన ఖాళీలు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు ఉన్నాయి.ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి,సంబంధిత రాష్ట్ర భాష మాట్లాడటం, చదవడం, రాయడం రావాలి.
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు జులై 1 2021వ తేదీకి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాల వారికి వయస్సు సడలింపు వర్తిస్తుంది. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ఆన్లైన్ విధానంలో ప్రిలిమినరీ(100 మార్కులు), మెయిన్స్( 200 మార్కుల )వారి ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఈ పరీక్షలు నెగటివ్ మార్కులు విధానం అమలులో ఉంది. ముందుగా ప్రిలిమ్స్ అర్హత సాధించిన వారు మాత్రమే మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు.
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్ట్ 1 2021 చివరి తేదీ. ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్షలు ఆగస్టు 28, 29 సెప్టెంబర్ 4న నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్షలు అక్టోబర్ 31 2021 జరగనుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఈ క్రింది వెబ్ సైట్ సంప్రదించగలరు. https://www.ibps.in/