దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిందే. రోజుకు 4 లక్షల కేసులు నమోదవుతున్నాయి. 3వేల మందికి పైగా చనిపోతున్నారు. రాను రాను పరిస్థితులు ఇంకా దారుణంగా మారుతాయని, కోవిడ్ సెకండ్ వేవ్ త్వరలో పీక్ దశకు చేరుకుంటుందని, తరువాత కోవిడ్ థర్డ్ వేవ్ కూడా వస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌పై జోరుగా చర్చ సాగుతోంది.
అయితే ప్రధాని మోదీ దేశంలో లాక్‌డౌన్‌ను పెట్టేది లేదని, ఆ విషయాన్ని రాష్ట్రాలకే వదిలేశామని అన్నారు. లాకడౌన్ అనేది చివరి అస్త్రమని, దాన్ని ప్రయోగించే వరకు పరిస్థితి తేవొద్దని అన్నారు. కానీ ఆ పరిస్థితి వచ్చేసింది. రానున్న రోజుల్లో ఇంకా దారుణంగా పరిస్థితులు మారే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అందువల్ల లాక్‌డౌన్‌ను తప్పనిసరిగా విధించాల్సిందేనన్న భావనకు వస్తున్నారు.
దేశంలో లాక్‌డౌన్‌ను విధిస్తే తప్ప కోవిడ్‌ను కట్టడి చేయలేమని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. అలాగే అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇక ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లను అమలు చేస్తున్నారు. దీంతో మోదీ లాక్ డౌన్ పెట్టాలా, వద్దా అనే విషయాన్ని చర్చిస్తున్నట్లు తెలిసింది. అయితే పరిస్థితులు చేయి దాటిపోయాయి కనుక లాక్‌డౌన్ పెడితేనే బాగుంటుందని అనుకుంటున్నట్లు సమాచారం. మరి మోదీ ఈ విషయంపై ఏం ప్రకటన చేస్తారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…