విశ్లేషణ

ఈట‌ల రాజేంద‌ర్‌, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు.. బీజేపీలోకి..?

తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. జ‌మున హ్యాచ‌రీస్ కోసం పేద‌ల నుంచి ఆయ‌న కుటుంబం స్థ‌లాల‌ను బ‌లవంతంగా లాక్కుంద‌నే ఆరోప‌ణ‌ల‌పై కేసు న‌డుస్తోంది. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే హైకోర్టు కీల‌క ఆదేశాలు కూడా ఇచ్చింది. అధికారులు స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేయాల‌ని ఆదేశించింది. అయితే ఆ విష‌యం అటుంచితే ఇప్పుడు ఈట‌ల భ‌విష్య‌త్తు ఏమిటి ? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ఈట‌ల తెరాస‌లో కొన‌సాగే అవ‌కాశం అస్స‌లు లేదు. అయిపోయింది. నేడో, రేపో ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి, తెరాస సభ్య‌త్వానికి రాజీనామా చేస్తార‌ని తెలుస్తోంది. అయితే త‌దుప‌రి ప్ర‌ణాళిక ఏమిటి ? కొత్త పార్టీ పెట్టాలా ? ఏదైనా వేరే పార్టీలో చేరాలా ? అని ఆయ‌న ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. అందుక‌నే త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు, అనుచ‌రులు, అభిమానుల‌తో ఆయన చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. అయితే ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలోనే చేరుతార‌ని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో ఆధిప‌త్య ధోర‌ణి అనేది ముందు నుంచి ఉంది. గ్రూపు రాజ‌కీయాల‌కు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేర‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు ఎప్పుడూ అంటుంటారు. అలాంటి పార్టీలో బ‌ల‌మైన నేత‌ల‌కు స‌రైన గుర్తింపు ఉండ‌ద‌ని అంటుంటారు. రేవంత్ వ్య‌వ‌హారం మ‌నం చూస్తూనే ఉన్నాం. ప‌లువురు సీనియ‌ర్లు అడ్డుకున్నార‌నే ఆయ‌న‌కు పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి రాకుండా పోయింద‌ని అంటుంటారు. ఈ క్ర‌మంలో అలాంటి పార్టీలో చేరితే మనుగ‌డ క‌ష్ట‌మ‌వుతుంద‌ని ఈట‌ల భావిస్తున్న‌ట్లు తెలిసింది.

ఇక ఇప్ప‌టికిప్పుడు కొత్త పార్టీ పెడితే దాన్ని బూత్ స్థాయిలో బ‌ల‌ప‌ర‌చాలంటే అందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. క‌నుక కొత్త పార్టీ ఆలోచ‌న లేద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఈట‌ల ముందు బీజేపీ ఒక్క‌టే ప్ర‌త్యామ్నాయంగా క‌నిపిస్తోంది. బీజేపీ ఇప్ప‌టికే తెలంగాణ‌లో కొంత వ‌ర‌కు బ‌లం పుంజుకుంది. మ‌రోవైపు కేంద్రంలోనూ అధికారంలో ఉంది క‌నుక అందులో చేరితే ఈట‌ల‌కు బ‌లం చేకూరుతుంది, ఇంకో వైపు రాజకీయ భ‌విష్య‌త్తు కూడా బాగుంటుంది. క‌నుక ఆయ‌న అందులో చేరే అవ‌కాశాలను కొట్టి పారేయ‌లేమ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీలో ఇమ‌డ‌లేక రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డితోపాటు ఇప్ప‌టికే అందులో ఉండి ఎవ‌రి స‌పోర్ట్ లేకుండా కాలం నెట్టుకొస్తున్న రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతార‌ని ఊహాగానాల వినిపిస్తున్నాయి. మ‌రి ఇందులో ఏది నిజ‌మ‌వుతుందో చూడాలి.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM